తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది.
ఇక విషయంలోకి వెళ్తే…
ఆంధ్రప్రదేశ్‌ను తాకిన ‘మొంథా’ తుఫాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. దీని కారణంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని పంటను కాపాడుకోవాలని సూచనలు జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడి.. ఆంధ్రప్రదేశ్‌ను కకావికలం చేస్తున్న ‘మొంథా’ తుఫాను ప్రభావం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తాకింది. దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మొంథా తుఫాను తీవ్రత పెరగడంతో,.. ఆంధ్రప్రదేశ్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావం తెలంగాణ తూర్పు, ఉత్తర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్…
ఈ మూడు జిల్లాలతో పాటు.. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ను కూడా మొంథా తుఫాను ప్రభావం తాకింది. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్కర్నూల్, నల్గొండ, మహబూబ్నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెంలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.