ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం వచ్చే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, పిడుగులు, బలమైన ఈదురుగాలులు (Gusts) వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక విషయంలోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Department of Meteorology) ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో (Southwest Bay of Bengal) అల్పపీడనం (low pressure) ఏర్పడినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) (APSDMA) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇది కేంద్రీకృతమైందని, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంటే రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ, రానున్న 36 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దక్షిణాది జిల్లాల్లో మోస్తరు వర్షాలు..
ఇక ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో నేడు ఒంగోలు(Ongoles), నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (MD Prakhar Jain) సూచించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఆయన హెచ్చరించారు. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ (Control room) నెంబర్లను అందుబాటులో ఉంచింది. ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.