Crazy update from Telugu reality show Bigg Boss Season 9

బిగ్ బాస్… తెలుగు నాట 8 సీజన్లు కంప్లీట్ చేసుకుని మరి కొద్ది రోజుల్లో 9వ సీజన్ ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుందా అని ఈగల్ గా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లకు బిగ్ బాస్ బిగ్ న్యూస్ చెప్పింది. ఈ సారి సెలబ్రెటీస్ తో పాటు సామన్యులు కూడా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సీజన్ లో ఓ క్రేజీ సింగర్స్ సైతం అడుగుపెట్టబోతున్నట్లు ఫీలిం నగర్ లో టాక్.

ఇక విషయంలోకి వెళ్తే..

బుల్లితెర ఆడియన్స్ వేయి కళ్లతో ఎదురు చూసే తెలుగు రియాలిటీ షో బిగ్‏బాస్. ఓవైపు వివాదాలు వస్తున్నప్పటికీ ఈ షోకు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటివరకు అన్ని భాషలలో వరుస సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాయ్.

ఇప్పటికే తెలుగులో 8 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని.. త్వరలో 9వ సీజన్ స్టార్ట్ కానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. దీంతో ఈ షో గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అనేకమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక సీజన్ 9 కు రోజులు దగ్గర పడటంతో.. బిగ్‏బాస్ నిర్వాహకులు ఒక వైపు కంటెస్టెంట్ ఎంపిక చేస్తునే మరో వైపు వరుస ప్రోమోస్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ప్రోమో కూడా చాలా ఆకస్తికరంగా ఉంది. ఈసారి చదరంగం కాదు, రణరంగం అంటూ హోస్ట్ చెప్పే డైలాగ్స్ మరింత ఊపందిస్తున్నాయి.

ఇక ఈ సారి బిగ్‏బాస్ సీజన్ 9 కోసం కంటెస్టెంట్స్ ఎంపికలో స్టార్ మా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది అన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి.. రోజుకో కంటెస్టెంట్ పేరు నెట్టింట చక్కర్లు కొడుతుంది. వెండి తెర నటి నటులు. బుల్లితెర సీరియల్ సెలబ్రిటీ తో పాటు.. ఈసారి కామన్ కేటగిరిలోనూ ఎంపిక చేయనున్నారట. అందులో భాగంగా ఆగస్ట్ రెండో వారంలో ఫైనల్ ఎంపిక జరుగుతుందని అంటున్నారు.

తాజా సమాచారం మేరకు.. ఓ క్రేజీ సింగర్ పేరు తెరపైకి వచ్చింది. అతను ఎవరో కాదు.. సింగర్ శ్రీతేజ. అవును ఈ సీజన్ లో సింగర్ శ్రీ తేజ పేరు వినిపిస్తుంది. ఇప్పటి వరకు అనేక సినిమాల్లో మంచి రొమాంటిక్, మెలోడి సాంగ్స్ తో ఫేమస్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సింగింగ్ విభాగం నుంచి ప్రతి సీజన్ కు ఒకరిని ఎంపిక చేస్తుంటారు. ఇక ఇప్పుడు సింగర్ కెటగిరి నుంచి శ్రీతేజను పైనల్ చేశారటా. అలాగే సీరియల్ నుంచి బ్యూటీ కావ్య శ్రీ సైతం ఈసారి సీజన్ 9లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల వరకు చిన్ని సీరియల్ ద్వారా అలరించింది కావ్య. ఇక విళ్లతో పాటు.. ఇటీవలే సోషల్ మీడియాలో యమా ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య కంచర్ల కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు.. కల్పిక గణేష్, దీపికా దేబ్జానీ, ఇమ్మాన్యుయేల్, సాయి కిరణ్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సీజన్ లో ఎవరేవరు పాల్గొనబోతున్నారో.. తెలియాలంటే మరో కొన్ని రోజులు వెట్ చేయ్యాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *