బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ విరుచుకుపడుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) ఆ రాష్ట్ర ఈసీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో ఈ సవరణను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ… ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- అసలు ఈసీతో కుమ్మక్కైందని రాహుల్ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా…?
- ఈసీపై అణుబాంబు పేల్చుతానంటూ చేసిన కామెంట్స్ పై బీజేపీ చేసిన విమర్శలు ఏంటి..?
ఓటర్ లిస్టులకు (Voter lists) సంబంధించి ఎలక్ట్రానిక్ డేటాను (Electronic data) కోరితే ఈసీ (EC) తమకు ఇవ్వడం లేదని, దాంతో ఈవీఎం (EVM) లతో ఎన్నికల నిర్వహణపై తమకు అనుమానం ఉందని గత కొన్నేళ్లుగా ఆరోపిస్తున్న రాహుల్… తాజాగా అవే ఆరోపణలను గుప్పించారు. బిహార్ (Bihar) లో లక్షల ఓట్లను తొలగించారని, దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు అడ్రస్ లేకుండానే ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ లిస్ట్‌లో పేర్లు ఉన్నా కానీ.. కొంతమంది ఫోటోలు సరిగా లేవని అన్నారు. అసలు ఏం జరుగుతుందని తెలుసుకోడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తే అసలు విషయం బయటపడిందని వెల్లడించారు. ‘కర్ణాటకలో 16 పార్లమెంట్ స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని అంచనా వేస్తే.. కాంగ్రెస్ అక్కడ 9 సీట్లలోనే గెలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు సెంట్రల్ సహా 7 లోక్‌సభ సీట్లలో అనూహ్యంగా ఓటమిపాలయ్యామని చెప్పుకొచ్చారు. ఇక మహారాష్ట్రలో వయోజనుల కంటే ఓటర్లు అధికంగా నమోదయ్యారన్న ఆయన… మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో బీజేపీ (BJP) తో ఈసీ కుమ్మక్కైందని అర్ధమైందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) దుయ్యబట్టారు.
బీజేజీ గెలుపు కోసమే ఈ ఓట్ల చోరీ జరుగుతుందా..?

బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ విరుచుకుపడుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) ఆ రాష్ట్ర ఈసీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో ఈ సవరణను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ… ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రస్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని, మధ్యప్రదేశ్ (Madhya Pradesh), మహారాష్ట్రతో (Maharashtra) పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ (Lok Sabha elections) అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఈసీ వ్యవహారం బయటపడిందని చెప్పారు. ఆరు నెలల పాటు తాము సొంతంగా దర్యాప్తు జరిపితే ఆటమ్ బాంబు లాంటి ఆధారాలు దొరికాయన్నారు. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి కూడా అవకాశమే ఉండదని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసమే ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఇది దేశద్రోహం కంటే తక్కువేం కాదని ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అయితే అధికారులు రిటైర్ అయినా.., ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
ఓట్ల చోరీని బయటపెట్టిన రాహుల్ గాంధీ..!

ఇక ఓటు చోరీ ఎలా జరిగిందో వివరిస్తూ రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్… దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల సంఘం జత కట్టి… గత ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ రాహుల్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో.. ఓ మహిళా ఓటరు రెండుసార్లు ఓటేశారంటూ వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చూపిన పత్రాలు.. ఎన్నికల కమిషన్ రికార్డుల నుంచి సేకరించినట్లు రాహుల్ చెప్పారు. అదేవిధంగా.. పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని ఆరోపించారు. అంతేకాదు బెంగళూరులోని ఓ ప్రాంతంలో ఒక్క కుటుంబానికి ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక ఉదాహరణగా చూపించారు. ఇన్ని దొంగ ఓట్ల వల్లే బిజెపి అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ‘ఒక వ్యక్తి- ఒకే ఓటు’ అనే ప్రజాస్వామ్య సూత్రంపై బీజేపీ, ఈసీ చేస్తున్న ఓట్ల చోరీ దాడిగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షపాత ఎన్నికల నిర్వహణకు సరైన ఓటర్ల జాబితా తప్పనిసరి అని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు, పార్టీలు ఆ జాబితాలను పరిశీలించేందుకు వీలుగా డిజిటల్ ఓటరు జాబితాలను విడుదల చేయాలని ఈసీని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యం కోసమే నా పోరాటం..!

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్లకు సంబంధించిన ముసాయిదా, తుది జాబితాల డిజిటల్, ఫిజికల్ కాపీలను రాజకీయ పార్టీలకు అందజేస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. పార్టీలకు ఓటర్ల జాబితా డిజిటల్ కాపీలను ఇవ్వరనే రాహుల్ ఆరోపణలను అవాస్తవంగా, తప్పుదోవ పట్టించేదిగా ఈసీ పేర్కొంది. అయితే తమ విచారణలో శకున్ రాణి అనే మహిళ ఒక్కసారే ఓటు వేశానని చెప్పారని ఈసీ పేర్కొంది. ఆమె రెండుసార్లు ఓటేశారంటూ ప్రజెంటేషన్‌లో రాహుల్ చూపిన టిక్ మార్క్ పత్రాలు కూడా పోలింగ్ అధికారి జారీ చేసినవి కావని ఈసీ వాదిస్తుంది. ఈ క్రమంలో తన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను అందించాలని, తద్వారా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టొచ్చని రాహుల్ గాంధీకి జారీ చేసిన నోటీసులో కర్ణాటక సీఈవో పేర్కొన్నారు. మరోవైపు.. ఎన్నికల సంఘం కూడా ఓట్ల చోరీ ఆరోపణలపై డిక్లరేషన్ సమర్పించాలని, లేదా తప్పుడు ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ ను కోరింది.