- ఉత్తరాఖండ్ లో వరుస వరదలు..
- దేవ్ భూమిపై ప్రకృతి పగపట్టిందా..?
- నిన్న ధారాలీ.. నేడు చమోలీ..
- ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో విరుచుకుపడిన క్లౌడ్ బరస్ట్
- శిథిలాల కింద బాధితులు..
- ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నాతు.. బాలిక మృతి
- మరొక వ్యక్తి గల్లంతు.. ముమ్మరంగా సహాయక చర్యలు
- కొట్టుకుపోయిన వాహనాలు.. రోడ్లు మూసుకుపోయి తీవ్ర నష్టం
- పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సీఎం పుష్కర్ సింగ్ ధామి
దేవ్ భూమి ఉత్తరాఖండ్ (Uttarakhand)లో మళ్లీ ప్రకృతి విరుచుకుపడింది. ఇటీవలే గంగోత్రి మార్గంలోని ధారాలీ గ్రామంలో (Dharali village) క్లౌడ్ బరస్ట్ (Cloudburst) జరిగిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన మరవక ముందే మరో సారి ఆ రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరాఖండ్ లో మరోసారి కుంభవృష్టి కురిసింది. చమోలీ జిల్లాలో (Chamoli District) మెరుపు వరదలు సంభవించాయి. దీంతో చమోలీ జిల్లా వరదల్లో కొట్టుమిట్టాడుతుంది. దేవ్ భూమిపై ప్రకృతి పగబట్టినట్లే ఉంది.. ఏంటి ఇలా అన్నారు అని అనిపిస్తుందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. అలాగే ఉంది మరి. క్లౌడ్ బరస్ట్ కారణంగా రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి కుంభవృష్టి కురిసింది. దీంతో చాలా నివాసాలు వరద నీటిలో మనిగిపోయాయి. సత్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద ఉండిపోయి.. ప్రాణాలు కోల్పోయింది. దీంతో పాటూ పలువురు గల్లంతయ్యారు.

హాయక చర్యలు ముమ్మరం..
చమోలీ జిల్లాలోని థరాలీ ప్రాంతంలో ఈ విపత్తు సంభవించింది. భారీ వర్షం కారణంగా థరాలీ మార్కెట్ (Tharali Market,) కోట్‌దీప్, తహసీల్ కాంప్లెక్స్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు, ఎస్డీఎం నివాసంతో పాటు అనేక భవనాల్లోకి బురద నీరు పోటెత్తింది. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. పట్టణంలోని వీధులన్నీ చెరువులను తలపించాయి. సమీపంలోని సగ్వారా గ్రామంలో ఓ బాలిక శిథిలాల కింద చిక్కుకుపోవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వరద ఉద్ధృతికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చెప్డాన్ మార్కెట్‌లోనూ కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి. ఇక్కడే మరొక వ్యక్తి గల్లంతైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. ముమ్మరం సహాయక చర్యలు చేపట్టాయి. వరద నీరు, ఇళ్ళల్లో చిక్కుకున్న స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఆకస్మిక వరదలపై సీఎం స్పందన..
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. “చమోలీ జిల్లా థరాలీ ప్రాంతంలో మేఘ విస్ఫోటనం గురించి విషాదకరమైన వార్త అందింది. జిల్లా యంత్రాంగం, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నేను అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
అప్పుడు ధరాలీ.. ఇప్పుడు చమోలీ..
అంతకు ముందు ఇదే నెల మొదట్లో ఆగస్టు 5వ తేదీన ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ ధారాలీ అనే గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో గంగోత్రీలోని ధరావలి గ్రామంపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా బురద రావడంతో ధరావలి గ్రామం మొత్తం బురదకు కొట్టుకుని పోయింది. ఇళ్లు, హోటళ్లు ఇలా కొండకి ఆనుకుని ఉన్న అన్ని కూడా నేలమట్టమయ్యాయి. ఈ భారీ బురద వల్ల నలుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గల్లంతయ్యారు. వీరితో పాటూ 11 మంది సైనికులు కూడా గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇప్పటి వరకూ దొరకనే లేదు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన ఉత్తరాఖండ్ ని ముంచెత్తింది.