Cloud burst disaster in Manali… More than 50 people dead..?

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రకృతి అందాలకు పుట్టినిల్లు.. ఎత్తైన హిమాలయ పర్వతాలు (Himalayan Mountains), దట్టమైన అడవులు, పచ్చని లోయలు, స్వచ్ఛమైన నదులు.. కాశ్మీర్ తర్వాత ప్రకృతి ప్రేమికులకు మరో స్వర్గధామం.. కానీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి అలా లేదు. శ్వేత వర్ణ పర్వతాలు… ఎప్పుడు తోజోమానం గా వెలిగే వెండి కొండల మధ్య ఉన్న రాష్ట్రం ప్రస్తుతం వరదలతో విల విల లాడుతుంది. భారీ వర్షాలకు, వరదలకు కులు మనాలి చిగురుటాకులా వణుకుతోంది.

హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి విలయతాండవం..

హిమాచల్ ప్రదేశ్‌లో ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్ని మునిగిపోయాయి. నైరుతి రుతుపవనాల (Southwest monsoon) ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో పలు చోట్ల క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) కావడంతో ఆకస్మిక వరదలు (Flash floods) చోటుచేసుకున్నాయి. కులు జిల్లాలో (Kullu District) ఆకస్మిక వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్ని వీడియోలలో వాహనాలు నీటిలో కొట్టుకుపోవడం కనిపించింది. ఈ వరదల వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జలవిద్యుత్తు ప్రాజెక్టు (Indira Priyadarshini Hydroelectric Project) సమీపంలో ఉన్న లేబర్‌ కాలనీకి చెందిన కార్మికులు దాదాపుగా ఒక 20 మంది వరదల్లో కొట్టుకుపోయి ఉంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

కుల్లు మనాలిలో క్లౌడ్ బరస్ట్..

హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ డైరెక్టర్ డీసీ రాణా మీడియాతో మాట్లాడుతూ.. క్లౌడ్ బరస్ట్ కారణమ అని ధ్రువీకరించారు. ఇక కులు జిల్లాలోని మూడు చోట్ల… సైంజ్‌లోని జీవా నల్లా, రెహ్లా బిహాల్, గడ్సా ప్రాంతంలోని శిలాఘర్‌లలో క్లౌడ్ బరస్ట్‌ కావడంతో కుండపోత వర్షం కురిసింది. రెహ్లా బిహాల్‌లో ముగ్గురు వ్యక్తులు తమ ఇళ్ల నుండి విలువైన వస్తువులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ వరదలో కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు.
ఇక అదేకాకుండా పార్వతి నది సైతం ఉప్పొంగి ప్రవహిస్తుంది.

మరో 48 గంటల్లో…

ఇక, రాబోయే 48 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. కాంగ్రా, మండి (Mandi), సిమ్లా (Shimla) , సిర్మౌర్, కులు, హమీర్‌పూర్, సోలన్, ఉనాతో సహా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 24 గంటల్లో అత్యధికంగా పాలంపూర్ (Palampur) 145.4 మి.మీ, జోగిందర్‌నగర్ 113.0 మి.మీ, నహాన్ 94.0 మి.మీ వర్షపాతం నమోదైంది. టాబోలో గంటకు 56 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని… సుందర్‌నగర్ (Sundarnagar) , కాంగ్రాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

కుల్లు, మనాలిలో భయానక దృశ్యం...

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *