China has unveiled a miracle in medicine. Surgery from a satellite has begun.

ప్రస్తుతం మన టెక్నాలజీ (Technology) యుగంలో ఉన్నాం. ఏ చిన్న పని అయినా ఇట్టే చిటికలో అయిపోతుంది. ఇంత వరకు శాటిలైట్ (Satellite)ద్వారా వరదలు సంభవించే గానీ, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలను (Natural disasters) ముందుగానే తెలుసుకునేందుకు శాటిలైట్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా యుద్ద సమయంలో కూడా శాటిలైట్ ఎంతో ఉపయోగం ఉంటుంది. కాగా డ్రాగన్ కంట్రీ చైనా (China) ప్రతి రంగంలో తన పట్టుదలను నిరూపించు కుంటున్నది. ఖగోళంలో సొంతంగా స్పేస్ సెంటర్ (Space Center) ని కట్టుకుంటున్న చైనా (China)… ఇప్పుడు ఏకంగా స్పేస్ నుంచే వైద్య చేసే విధంగా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. ప్రస్తుతం చైనా వైద్యులు ఓ అరుదైన ఘట్టం ఒకటి ఆవిష్కృతమైంది. మరి ఏంటి ఆ మెడికల్ మిరాకిల్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.

వైద్యశాస్త్రంలో అద్భుతం..

వైద్యశాస్త్రంలో అద్భుతంగా అభివర్ణించదగిన అరుదైన ఘట్టం ఒకటి ఆవిష్కృతమైంది. చైనా వైద్యులు మరో అద్భుతం సృష్టించారు. శాటిలైట్‌ సాంకేతిక ద్వారా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స అందించారు. వైద్యారోగ్య రంగంలో (Healthcare sector) ఇదో సంచలన మార్పుగా భావిస్తున్నారు. ఈ సర్జరీకి పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రి ప్రొఫెసర్ రాంగ్ లియూ (Wrong Liu) నేత నేతృత్వం వహించారు. ఈ వైద్య బృందం లాసాలో ఉండి రోబోల సాయంతో 5 వేల కిలోమీటర్ల దూరంలో బీజింగ్‌లో ఉన్న ఇద్దరు రోగులకు కాలేయ సర్జరీలు చేశారు. వైద్యారోగ్య రంగంలో ఇదో సంచలన మార్పుగా భావిస్తున్నారు.

వైద్య చరిత్రలో విప్లవాత్మకమైన పురోగతి..

శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ (Satellite communication system) ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్న రోగులకు ఇలా సర్జరీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సర్జరీలు కూడా విజయవంతం అయ్యాయి. దీంతో ఇకనుంచి మారుమూల ప్రాంతాలు, యుద్ధక్షేత్రాలు, విపత్తుల్లో ఇరుక్కున్న ప్రదేశాల్లో ఉండేవారికి శాటిలైట్‌ సాంకేతికత ద్వారా ఆపరేషన్‌లు చేయొచ్చని వైద్య బృందం తెలిపింది.

వైద్యుల లేకుండానే.. వైద్య చికిత్స..

ఈ అరుదైన ఘటనలో టిబెట్ (Tibet) లో జరిగింది. టిబెట్లోని లాసాలో ఉన్న వైద్య బృందం బీజింగ్ (Beijing) లోని 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇద్దరు రోగులకు రోబోటిక్ సాయంతో కాలేయ శస్త్రచికిత్స (Liver surgery) నిర్వహించింది. PLA జనరల్ హాస్పిటల్ కు చెందిన ప్రొఫెసర్ రోంగ్ లియు నేతృత్వంలో కాలేయ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ను ఉపయోగించి ఇప్పటివరకు నిర్వహించిన అతి పొడవైన దూర శస్త్రచికిత్సగా నిలిచింది. అంటే భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున ఉండే కక్ష్యలో ఆప్‌స్టార్ 6డీ అనే శాటిలైట్ ఉంది. దీని సాయంతో 68 ఏళ్ల లివర్ క్యాన్సర్‌ రోగికి, 56 ఏళ్ల హెపటిక్ హెమాంగియోమా రోగికి శస్త్రచికిత్సలు చేశారు. అయితే ఈ రెండు ఆపరేషన్లను కేవలం 105 నుంచి 124 నిమిషాల్లోనే పూర్తిచేశారు. లాసాలోని ఆస్పత్రిలో ఉన్న చీఫ్‌ సర్జన్ రోబోల సాయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి. ఇక ఈ ఆపరేషన్లలో రోగులు కేవలం 20 మిల్లీలిటర్ల రక్తం మాత్రమే నష్టపోయారని.. ఆ తర్వాత వాళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ కనిపించలేదని తెలిపారు. 24 గంటల్లోనే వాళ్లని ఇంటికి పంపించామని వైద్య టీమ్ పేర్కొంది. ఈ సర్జికల్ రోబోల ద్వారా ఇక నుంచి 5 వేల కిలోమీటర్ల నుంచి 1.50 లక్షల కి.మీ దూరంలో ఉండే రోగులకు కూడా ఆపరేషన్ చేయవచ్చని స్పష్టం చేసింది.

ఇకపై మీరు ఎక్కడ ఉన్న చిటికలో వైద్య చికిత్స చేయవచ్చు..

ఉపగ్రహ శస్త్రచికిత్స (Satellite surgery), సిద్ధాంతపరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ, సిగ్నల్ ఆలస్యం కారణంగా సవాళ్లను ఎదుర్కొంది. వీటిని అధిగమించడానికి, ప్రొఫెసర్ లియు బృందం మూడు ప్రధాన ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. 632 ms జాప్యంలో కూడా రోబోటిక్ హ్యాండ్ లోపాన్ని 0.32 mmకి పరిమితం చేసేలా న్యూరాల్ నెట్వర్ ను వినియోగించింది. అలాగే ఉపగ్రహం విఫలమైతే తక్షణమే 5G బ్యాకప్ కు మారే ద్వంద్వ- లింక్ వ్యవస్థను, HD ఇమేజింగ్ను కొనసాగిస్తూనే, డేటా లోడ్ ను 62శాతం తగ్గించేందుకు డైనమిక్ బ్యాండ్విడ్త్ కేటాయింపును వాడింది. దీంతో సుదీర్గ దూరల నుంచి సైతం చికిత్స చేసేందుకు ఆవిష్కరణ జరిగింది.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *