ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇక వివరల్లోకి వెళ్తే..
దేశంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే చార్ ధామ్ యాత్ర ఏటా వేసవిలో మొదలై.. శీతాకాలం వరకు కొనసాగుతుంది. ఏడాదిలో ఆరు నెలల పాటు మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ ప్రదేశాలు హిమాలయాల్లో ఉండటం వల్ల శీతాకాలంలో మంచు తీవ్రత దృష్ట్యా యాత్రను నిలిపివేస్తారు. చార్ ధామ్ యాత్ర అనేది ఉత్తరాఖండ్‌లోని నాలుగు పవిత్ర తీర్థయాత్ర స్థలాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు ఒక ప్రయాణం. వీటిని హిందూ మతం నాలుగు ఆత్మ-శుద్ధి చేసే పుణ్యక్షేత్రాలు అని కూడా పిలుస్తారు. ఇక ఈ ఏడాది ఛార్‌ధామ్ యాత్ర ముగింపు తేదీలను కేదార్‌నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ తాజాగా ప్రకటించింది. సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. తొలుత యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్‌నాథ్, చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేయనున్నామని చెప్పారు. యమునోత్రిలో మాత యమున, గంగోత్రిలో గంగామాత, కేదార్‌నాథ్‌లో పరమేశ్వరుడు, బద్రీనాథ్‌లో శ్రీమన్నారాయణుడు పూజలందుకుంటారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఛార్ ధామ్ యాత్రకు 38 లక్షల మంది భక్తులు వచ్చారని అజయ్ వెల్లడించారు. వీరిలో 11 లక్షల మందికి పైగా భక్తులు బద్రీనాథ్‌ను, 13.5 లక్షల భక్తులు కేథార్‌నాథ్‌ను సందర్శించారని చెప్పారు.
ఆలయ మూసివేతకు కారణమిదే..

శీతాకాలం కారణంగా నిబంధనల ప్రకారం లార్డ్ కేదార్‌నాథ్ ద్వారపాలకుడైన భుకుంత్ భైరవనాథ్ ఆలయ తలుపులు ఆరు నెలల పాటు మూసివేస్తారు. శనివారం ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో కేదార్‌బాబా పంచముఖి డోలీని ప్రతిష్టించనున్నారు. తదుపరి ఆరు నెలల పాటు, ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం జరుగుతాయి. అదే సమయంలో బద్రీ-కేదార్ ఆలయ కమిటీ ఆలయ తలుపులు మూసివేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.
1200 ఏళ్ల నాటి ఆలయం..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న చార్ ధామ్‌లను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలి కాలమంతా మంచు కప్పి ఉంటుంది. వాటిని దర్శించుకోవడం కుదరదు. అందువల్ల ఆరు నెలల పాటు దేవాలయాను మూసేసి ఉంచుతారు. భూమికి 10 వేల నుంచి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఈ ద్వాదశ జ్యోతిర్లాంగాలలో ఒకటైన కేదార్‌నాథ్ సముద్ర మట్టానికి 3,583 మీటర్ల ఎత్తులో మందాకినీ నది పక్కన ఉంది. ప్రపంచంలోని శివుడి ప్రత్యేకమైన ఆలయాల్లో ఇది ఒకటి. పరవేశ్వరుడ, ఆయన భక్తులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఇదొకటి. సుమారు 1200 సంవత్సరాల క్రితం ఛార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు.
భాయ్ దూజ్ పండుగ..

క్యాలెండర్ ఆధారంగా ఈ సంవత్సరం భాయ్ దూజ్ పండుగను అక్టోబర్ 23న జరుపుకోబోతున్నారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం భాయ్ దూజ్‌ని యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు యమరాజ్ తన సోదరి యమునాజీని కలవడానికి వచ్చారని చెబుతుంటారు. అప్పటి నుంచి ఈ పండుగను భాయ్ దూజ్‌గా జరుపుకుంటారు.