Chandrababu Naidu holds the record as the richest CM in India

దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడిగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.

ఓ నివేదిక ప్రకారం చంద్రబాబు మొత్తం రూ.931 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. దీంతో ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. చంద్రబాబు 1992లో రూ.7వేల పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్థాపించారు. 1994లో IPOకు వెళ్లగా రూ.6.5 కోట్లు సమకూరాయి. 1995లో దీని మార్కెట్ వాల్యూ రూ.25 కోట్లు ఉండగా 2025లో రూ.4,500 కోట్లకు చేరింది. చంద్రబాబు 1994లో మంత్రి కాగానే తన భార్య భువనేశ్వరికి హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భువనేశ్వరికి 24.37% వాటా ఉంది. దీన్ని చంద్రబాబు సంపదగా పరిగణించడంతో ఆయన దేశంలో అత్యంత సంపన్న CMగా నిలిచారు.

ఇక చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉండగా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులపై చేసిన ఈ విశ్లేషణలో, సగటు ఆస్తి విలువ రూ.54.42 కోట్లుగా తేలింది. మొత్తం ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.1,632 కోట్లుగా ఉందని నివేదిక వెల్లడించింది. వీరిలో ఇద్దరు ముఖ్యమంత్రులు బిలియనీర్ల కేటగిరీలోకి చేరారని కూడా తెలిపింది.

ఇక వాళ్ల తర్వాత.. ఈ జాబితాలో అట్టడుగున మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె దగ్గర మొత్తం ఆస్తులు కేవలం రూ.15.38 లక్షలు మాత్రమే ఉన్నాయి. 2021 భవానీపూర్ ఉప ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, మమతా వద్ద రూ.69,255 నగదు, రూ.13.5 లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్ ఉన్నాయి. అంతేకాదు, ఆమె పేరిట ఎలాంటి భూమి లేదా ఇల్లు లేకపోవడం ప్రత్యేకత. ఆమె వద్ద ఉన్న ఏకైక ఆస్తి 9 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.43,837 విలువ). గడచిన సంవత్సరాలుగా ఆమె ఆస్తులు తగ్గుముఖం పట్టాయని ఈ లెక్కలు చెబుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *