ఒక్క 1కే నెల రోజుల అన్లిమిటెడ్ కాల్స్..
భారత్ ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ BSNL వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ ప్రత్యేకంగా ‘ఫ్రీడమ్ ప్లాన్’ పేరుతో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు కేవలం రూపాయికే 30 రోజుల పాటు 4జీ సేవలను పొందే వీలు కల్పిస్తున్నది. అయితే, పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇటీవలే BSNL దేశవ్యాప్తంగా తన స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు అపరిమిత లోకల్-ఎస్టీడీ కాల్స్, రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా సిమ్ సైతం లభిస్తుంది.
BSNLఆజాదీ కా ప్లాన్’
‘ BSNLఆజాదీ కా ప్లాన్’ పేరుతో అందిస్తున్న ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు వర్తిస్తుందని వెల్లడించింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లు, రోజుకు 2 GB డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ 2025 ఆగస్టు 1 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆఫర్‌ను పొందాలనుకునే వినియోగదారులు సమీప బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రిటైలర్‌ను సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా 4జీ సేవలను విస్తరించడంతో పాటు, కొత్త వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా BSNL ఈ కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం.