Phone Tapping : తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రాష్ట్రం లో ప్రభుత్వాం మారడంతో… ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇప్పటికే మూడు సార్లు ఎస్ఐబీ మాజీ చీఫ్ సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. మంగళవారం కూడా రావాల్సి ఉన్నా.. హాజరు కాలేదు.
Also Read : https://www.brknews.in/hindu-scripture-bhagavad-gita-not-burnt-in-ahmedabad-plane-crash/
ఆ ఆరుగురు…
నేడు ఆరుగురు నిందితులను కలిపి విచారించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇక రెండు రోజులుగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు సిట్ కార్యాలయంలో వాగ్మూలం ఇస్తున్నారు. ఇప్పటికే… టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సైతం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే ప్రభాకర్ (‘Prabhakar) రావుతోపాటు నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు (Radhakishan Rao), భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావు (Praneeth Rao), శ్రవణ్ లను హజరు కావాలని సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నేడు ఆరుగురిని కలిపి విచారించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.
కీలక నేత ఆయనే…

అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు పోలీసులు. బీజేపీ నాయకుల రాజకీయ వ్యూహాలు, ముందస్తు ప్రచార కార్యాచరణ, ఆర్థిక వ్యవహారాలపై సంపూర్ణ సమాచారం తెలుసుకోవడమే లక్ష్యంగా ఫోన్లను ట్యాప్ చేశారని అధికారులు గుర్తించారు. బీజేపీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం మొత్తాన్ని ప్రభాకర్ రావు తన ముట్టడిలో ఉన్న ఓ వ్యక్తి, భుజంగరావుకు పంపించారని సమాచారం. భుజంగరావు ఆ డేటాను వాడుకుని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు సార్…

ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఎంపీలు ఈటల రాజేందర్ (Etala Rajender), ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind), రఘునందన్ రావు (Raghunandan Rao), బీజేపి ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిలకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేడు వారంతా సిట్ కు వాంగ్మూల్ ఇచ్చే అవకాశముంది. 2023 నవంబర్ 15 నుంచి బీజేపి నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. బీజేపీ ( BJP ) నేతలు, వారి ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం.
Suresh