Karimnagar Mayor : కరీంనగర్ లో వన్ మ్యాన్ షో..! ఫలించిన బండి సంజయ్ వ్యూహం..!
Karimnagar : గత నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర దించుతూ కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 66 స్థానాలకు గాను 30 కార్పోరేటర్లను గెలుచుకున్న బీజేపీ మొదటి నుంచి మేయర్ రేసులో కొనసాగింది. మధ్యలో మంత్రి పొన్నం ప్రభాకర్ తాము కూడా రేసులో ఉన్నామంటూ ప్రకటించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్రులతో కలిపి ఆ పార్టీకీ బలం లేకపోవడంతో బీఆర్ఎస్ మద్దతు అనివార్యం అయింది. ఇక తాజాగా.. అడ్డంకులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టిన భారతీయ జనతా పార్టీ.. కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఘనంగా దక్కించుకుంది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ నూతన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇక విషయంలోకి వెళ్తే..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ వీడింది. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. అలాగే డిప్యూటీ మేయర్ పదవిని కూడా కమలం పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ తన మార్క్‌ను చాటుకున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే… మొత్తం 66 స్థానాలు ఉండగా, బీజేపీ 30 స్థానాలు, కాంగ్రెస్ 14 స్థానాలు, ఎంఐఎం 3 స్థానాల్లో, బీజేపీ 9 స్థానాల్లో, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు స్థానాల్లో, స్వతంత్రులు 8 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఇక్కడ నమోదు చేసుకున్నారు. అయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు బండి సంజయ్ తనవంతు ప్రయత్నాలు చేశారు. కొందరు స్వతంత్రులను బీజేపీ వైపునకు తిప్పుకున్నారు.
బీజేపీ నెత్తిన పాలుసోసిన బీఆర్ఎస్..!
కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని ప్రకటించడంతో బీజేపీ లైన్ క్లియర్ అయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 69 ఓట్లు ఉండగా.. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్ల మద్దతు లభించింది. మరోవైపు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి 21 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తటస్థంగా ఉంది. ఇగ ఈ అవకాశం బీజేపీ నెత్తి మీదా పాలు పోసినట్లు అయ్యింది. ఇగ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థి డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు గెలిచారు. దీంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా నిలుపుతామని ప్రకటించిన బండి సంజయ్ ఆశయం నెరవేరింది. అలాగే డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు గెలిచారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశయం నెరవేరి.. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా రెపరెపలాడింది.
ఫలించిన బండి సంజయ్ వ్యూహం..!
దీంతో కరీంనగ్ మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారిగా బీజేపీ చేతుల్లోకి వెళ్లింది అని చెప్పాలి. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఫలితం వెనక బండి సంజయ్ కృషి ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. అయితే మొత్తంగా కరీంనగర్‌లో ‘‘కమలం’’ పార్టీ అద్భుత ప్రదర్శనలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహం ఫలించింది అని చెప్పాలి. సర్వేలపై ఆధారపడటంతో పాటు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు టికెట్లు ఇచ్చారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతలను భుజానికి ఎత్తుకుని బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కరీంనగర్ మేయర్ పీఠంపై బీజేపీ కార్పొరేటర్‌ను కూర్చొబెట్టడంలో సక్సెస్ అయ్యారు. మొత్తంగా కరీంనగర్‌లో ‘‘బండి’’ మార్క్ రాజకీయం కనిపిస్తుంది.
