బిహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బ్టటి ఎన్డీయే భారీ ఆధిక్యంలో ఉంది. బిహార్ చరిత్రలోనే మొదటిసారి అత్యధిక ఓటింగ్ నమోదుకాగా.. ప్రభుత్వం మారుతుందనే అంచనాలు తల్లకిందులయ్యాయి. అయితే, దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. అంతకు మించి ఎన్డీయే కూటమి విజయం అందుకునే దిశగా సాగుతోంది.
ఇక విషయంలోకి వెళ్తే..
బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల తుఫానులో ఆర్జేడీ, కాంగ్రెస్లు కొట్టుకుపోయాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ లో, ఏకంగా 200 లకు పైగా స్థానాలు సాధించింది ఎన్డీఏ కూటమి.
బీహార్ నినాదం.. “అబ్కీ బార్ 199 పార్”
ఇక ముఖ్యంగా బీహార్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దినంగా మారింది. బీహార్ లో కాంగ్రెస్ కన్నా MIM పార్టీ 6 మంది అభ్యర్ధులు ముందంజులో ఉన్నారు. సీమాంచల్‌లో నాలుగు సీట్లలో MIM ఆధిక్యం ఉంటే, జోకిహిట్, బైసీ, కోచాధామన్, ఆమౌర్‌లో ముందంజులో ఉంది. ముఖ్యంగా సీమాంచల్‌లో మహాఘట్‌బంధన్‌ను ఎంఐఎం పార్టీ దారుణంగా దెబ్బతీసింది.
బీహార్ లో మెజార్టీ సీట్లలో ఓట్లను చీల్చడంలో ఎంఐఎం పార్టీ వ్యూహాం అయితే ఫలించింది. ఇక బీహార్‌లో ప్రభావం చూపని ప్రశాంత్ కిశోర్ పార్టీ సైతం ఎలాంటి ప్రభావం చూపించలేక పోయింది. ఎన్నికల ముందు 150కి పైగా సీట్లు వస్తాయి అన్న ప్రశాంత్ కిషోర్.. తాజా ఎన్నికల ఫలితాల్లో మాత్రం 1 సీటు కూడా గెలవలేదు. 230 సీట్లలో జన్‌సురాజ్ పార్టీ పోటీ చేసింది. ప్రస్తుతం 3శాతం ఓట్లతో ఉన్న జన్‌సురాజ్ పార్టీ.. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్‌లో NDA హవా ఉన్నప్పటికి సీటు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 93, JDU 84, RJD 26, లోక్ జనశక్తి పార్టీ 19, AIMIM 5, హిందుస్తానీ అవామ్ మోర్చా 5, రాష్ట్రీయ లోక్ మోర్చా 4, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి 4, Others 7 సీట్లు వచ్చాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో అమిత్‌షా నినాదం నిజమవుతోంది అని చెప్పాలి “అబ్కీ బార్ 160 పార్” అన్న అమిత్ షా నినాదం ఇప్పుడు బీహార్ లో ఊపందుకుంది. ఇప్పటికే 200 మార్క్ దాటి ఎన్డీఏ కూటమి సత్తా చాటింది.
బీహార్ లో ఫలించిన “నిమో” జోడీ సూపర్ హిట్..
ఈ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీల “నిమో” జోడీ సూపర్ హిట్ అయింది. రెండు పార్టీలు కూడా వ్యతిరేతకను అధిగమించాయి. మరోవైపు, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో పొత్తుల ముందు నుంచే లుకలుకలు ఏర్పడ్డాయి. ఎన్డీయే కూటమిలో ముందు నుంచి అన్ని పార్టీలు సయోధ్యతో సీట్ల ఒప్పందాన్ని కదుర్చుకున్నాయి. ప్రచారాన్ని ఎలాంటి విభేదాలు లేకుండా నిర్వహించాయి. ఇది కూడా ఎన్డీయే కూటమి విజయానికి దోహదపడింది. ఇక మోడీ ఫ్యాక్టర్, నితీష్ కుమార్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి కారణమైంది. ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రచారం కలిసి వచ్చింది. తేజస్వీ యాదవ్, నితీష్ కుమార్ వయసు గురించి కించపరిచేలా విమర్శలు చేయడం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా, జేడీయూకు సింపతీగా మారాయి.