Bigg Boss fame Lobo sentenced to one year in prison!

బిగ్ బాస్ ఫేమ్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు (Muhammad Qayyum) జనగామ కోర్ట్ ఏడాది జైలు శిక్ష (Imprisonment) విధించింది. 2018లో లోబో (Lobo) కారు నడుపుతూ నిడిగొండ ప్రాంతం వద్ద ఆటోను ఢీకొట్టిన కేసులో ఈ శిక్ష పడింది.

2018, మే 21న లోబో ఓ టీవీ ఛానల్‌ (TV channel) కార్యక్రమం కోసం వీడియో షూట్ చేయడానికి గాను.. తన టీమ్‌తో కలిసి వరంగల్ (Warangal) జిల్లాలోని లక్నవరం, భద్రకాళి చెరువు (Bhadrakali Lake), రామప్ప, వేయిస్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సమయంలో లోబోనే స్వయంగా కారు నడిపారు. లోబో కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్‌కు వస్తుండగా.. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద యాక్సిడెంట్ జరిగింది. లోబో తన కారుకు ఎదురుగా వచ్చిన ఓ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు అనే ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూనే చనిపోయారు. అలానే ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరి కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో లోబో, అతడి టీమ్ ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది. దీంతో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అప్పటి కేసులో తాజాగా జనగామ కోర్టు తీర్పు వెల్లడించింది.

బిగ్ బాస్ (Big Boss) ఫేమ్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు జనగామ కోర్ట్ ఏడాది జైలు శిక్ష విధించింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్ వస్తుండగా నిడిగొండ ప్రాంతం వద్ద ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ ఇద్దరూ మృతి చెందారు. కారు కూడా బోల్తా పడడంతో లోబోతో పాటు కారులు ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేయగా.. విచారించిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. యాక్సిడెంట్ లో ఇద్దరు మరణించడంతో లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. రూ.12,500 జరిమానా విధించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *