Bigg Boss - 9 as a wild card entry.. Alekhya, Chitti Pickles, Divvela Madhuri

త్వరలో బిగ్ బాస్ 9 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం. అయితే వీరి వల్ల హౌస్ హర్మోన్ మారుతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఆరు లేదా ఏడుగురు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇక విషయంలోకి వెళ్తే..

తెలుగు రియాలటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షోలోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. ఈ సీజన్‌లో మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 6గురు కామనర్స్ హౌస్‌లోకి వెళ్లారు. ఊహించని ట్విస్టులు, కాంట్రవర్సీలు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున తన హోస్టింగ్‌తో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు క్లాస్ కూడా ఇచ్చారు. ఇక నామినేషన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా, తొలి రౌండ్‌లోనే భరణి, మాస్క్ మాన్ హరీష్ సేఫ్ అయ్యారు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో డిమాన్ పవన్ విజయం సాధించి మరోసారి కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటికే రెండు వారాలు పూర్తి అయ్యింది. మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ వెళ్లిపోగా, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో బిగ్ బాస్ 9 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం.

గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అంత రసవత్తరంగా అయితే సాగడం లేదు. ఈ సీజన్‌లో రణరంగాలు ఎక్కువగా ఉంటాయని హోస్ట్ నాగార్జున చెప్పారు. కానీ ఆశించినంత స్థాయిలో అయితే ఈ సీజన్ ప్రేక్షకులను అలరించడం లేదు. ఈ సీజన్‌లో ఇమ్మాన్యూయెల్ కాస్త కామెడీ చేస్తున్నాడు. ఇక సంజనా హౌస్‌ను కాస్త యాక్టివ్‌గా ఉంచడం కోసం ట్రై చేస్తోంది. ప్రేక్షకులు బిగ్ బాస్ చూడటానికి కాస్త ఇష్టపడుతున్నారంటే దానికి ముఖ్య కారణం సంజనా. ఈమె హౌస్‌లో ఉన్నందరికి కూడా చుక్కలు చూపిస్తోంది. మొదటి రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న సంజనా ఇప్పుడు ఆటలో అదరగొడుతుందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా.. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అంటూ సోషల్ మీడియా లిస్టులో కనిపించిన చాలా మంది సెలబ్రిటీలు హౌస్ లోకి రాలేకపోయారు. వారిలో ముఖ్యంగా నటి సుహాసిని, బుల్లితెర నటి కావ్యశ్రీ, అలేఖ్య, చిట్టి పికిల్స్, దివ్వెల మాధురి ఇలా చాలా మంది హౌస్ లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ మొదటి లిస్టులో వీరు కనిపించలేదు. అయితే వీరంతా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. గత సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కారణంగానే హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ డబుల్ అయ్యింది. రోహిణి, అవినాష్‌, హరితేజ, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, మెహబూబ్ లు షో మధ్యలో వచ్చి బిగ్ బాస్ ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించారు. వీరిలో గౌతమ్ కృష్ణ ఏకంగా బిగ్ బాస్ సీజన్ 8 రన్నరప్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కచ్చితంగా ఉండనున్నాయి. ఇందులో ఒక ప్రముఖ నటి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గేమ్ ప్లాన్‌ను మార్చి, ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తాయని బిగ్ బాస్ భావిస్తోంది. మరి వీరు షోని ఎలా మారుస్తారనే విషయం చూడాలి. అయితే ఈ నాలుగో వారంలో వైల్డ్ కార్డుల ఎంట్రీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి మున్ముందు ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఎలా మారబోతుందో చూడాలి.

ఇక ఎలిమినేషన్ నుంచి బయటపడ్డా, మరో టాస్క్‌లో 12 మంది కంటెస్టెంట్లు ఫ్లోరా షైనీని “మోస్ట్ బోరింగ్ పర్సన్”గా ఎంపిక చేయడంతో ఆమె బిగ్ బాస్ లాకప్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో హౌస్‌లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తంగా వీకెండ్ ఎపిసోడ్‌లో ఒక ఎలిమినేషన్, ఒక లాకప్ శిక్షతో బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్లకు మిక్స్‌డ్ ఎమోషన్స్ ఎదురయ్యాయి. నాగార్జున హోస్టింగ్, బిగ్ బాస్ ట్విస్టులు షోకు మరింత ఉత్కంఠను తెచ్చాయి. ఇక మూడో వారం బిగ్ బాస్ హౌజ్‌లో ఎలాంటి ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *