SSMB 29 Big Update | సూపర్‌స్టార్ మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను పంచుకున్నాడు అమర శిల్పి జక్కన్న. నేడు మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా SSMB29 ప్రాజెక్ట్ నుంచి అప్‌డేట్‌ను పంచుకున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో #ప్రపంచ యాత్రికుడు (GlobeTrotter)ని రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌లో పంచుకున్నాడు. ఈ పోస్టర్‌లో మహేశ్ బాబు మొహం కనిపించకుండా శివుడి త్రిశులం, నందితో ఉన్న లాకేట్‌ను ధరించి కనిపిస్తుంది.
కొన్ని నెలల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. కానీ మొదటి సారి ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా విడుదలైన పోస్టర్ అదిరిపోయింది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో ప్రియంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్.
రాజమౌళి పెట్టిన పోస్టులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రేమికులతోపాటు మహేష్ అభిమానులకు తెలియజేస్తూ.. “మేము కొద్ది రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించాము. సినిమా గురించి తెలుసుకోవాలని మీ తనప నేను అర్థం చేసుకోగలను. సినిమా స్టోరీ కానీ స్కోప్ కానీ చాలా పెద్దదని.. అందుకో కొన్ని ఫోటోస్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లు కానీ.. దానికి న్యాయం చేయలేదని భావిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మీకు సినిమాను ఎంత అద్భుతంగా చూపించాలనే విషయం మీద ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని.. అలాగే ఫస్ట్ రివీల్ కూడా అంతే అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. నవంబర్ 2025 వరకు మీరు ఆగక తప్పదు. ఇప్పటివరకు ఎన్నడూ చూడనటువంటి సినిమాను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అందుకే కాస్త ఓపిక పట్టాల్సిందే” అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.
ఇక చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై ఇప్పిటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేశారు.