రాజా సాబ్ సినిమా నుంచి బిగ్ అప్డేట్..
పాన్ ఇండియా (Pan India) స్టార్.. హీరో డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీస్ లో రాజాసాబ్ (Rajasaab) ఒకటి. ప్రబాస్ గతంలో ఎప్పుడు లేని విధంగా.. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ గురించి క్రేజీ అప్డేట్ (Big Update) వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు. జులై మొదటి వారం నుంచి ఈ షూట్ స్టార్ట్ కాబోతోంది. ప్రత్యేకంగా వేసిన కోటలో ఈ షూట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ తో పాటు ఇతర నటులపై ఇంపార్టెంట్ సీన్లు షూట్ చేస్తారని తెలుస్తోంది.
హారర్ ట్రాక్ లో అదరగొట్టుడే
ఇప్పటి వరకు జరిగిన సీన్లకంటే ఇవి ఇంకా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. హర్రర్ (Horror Movie) ఎపిసోడ్ లు ఎక్కువగా ఈ షెడ్యూల్ లోనే జరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫౌజీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే రాజాసాబ్ సెట్స్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ రెండు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓల్డేజ్ గెటప్ (Oldage Getup) లో ఉన్న ప్రభాస్ పాత్రను రివీల్ చేయట్లేదు. దాన్ని ట్రైలర్ లో చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ పాత్రనే సినిమాకు సోల్ అని తెలుస్తోంది. యంగ్ లుక్ లో ప్రభాస్.. వింటేజ్ రెబల్ స్టార్ ను గుర్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో కంప్లీట్ కామెడీ, హర్రర్ ట్రాక్ లోనే ఉండబోతోంది. ప్రభాస్ ఫస్ట్ టైమ్ ఇలాంటి హర్రర్ సినిమా (Horror Movie) లో నటిస్తున్నాడు.
Suresh