Big update from IPL... The auction will be held in that country...!

ఐపీఎల్ 2026 వేలం వచ్చే నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాలు విదేశాల్లో వేలం జరిగింది. కానీ ఈసారి మాత్రం భారత్‌లోనే వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. డిసెంబర్ 15వ తేదీన వేలం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతకంటే నెలరోజుల ముందు అంటే నవంబర్ 15 నాటికి ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది!

ఇక విషయంలోకి వెళ్తే…

ఐపీఎల్ 2026 వేలానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ మినీ వేలం వచ్చే నెలలో జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీన ఈ ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇదే తేదీని ఖరారు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోందని సమాచారం. ఇక ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలకు ఈ విషయంపై సమాచారం అందినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 మినీ వేలానికి సంబంధించి.. అన్ని ఫ్రాంఛైజీలు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది! గత రెండు సీజన్లలో వేలం విదేశాల్లో జరిగింది. 2023లో దుబాయిలో, 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం ప్రక్రియ నిర్వహించారు. కానీ ఈసారి మాత్రం భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందట. ముంబై లేదా ఢిల్లీలో వేలం జరిగే అవకాశం ఉంది. కానీ వచ్చే సీజన్ కూడా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబి నగరంలో చేస్తుండ్రు. అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026 Auction) – 2026 సీజన్ వేలం వరుసగా మూడో ఏడాది విదేశీ గడ్డపైనే జరగనుంది.

దుబాయ్ వేధికగా IPL వేలం..

ఇక ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. కాగా 2023లో దుబాయ్, 2024లో జిద్దాలో ఐపీఎల్ లీగ్ వేలం నిర్వహించారు. అయితే, వేలం పాటకు సంబంధించిన తేదీ విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో వేలం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా పది ఫ్రాంఛైజీలు నవంబరు 15 నాటికి తాము అట్టిపెట్టుకునే, విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా ఐదేసి సార్లు ట్రోఫీ గెలవగా.. కోల్కతా నైట్ రైడర్స్ మూడు, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి చాంపియన్గా నిలిచాయి.

ఈ నెల 27న మహిళ ప్రీమియర్ లీగ్ వేలం..

ఇక ఈసారి జరిగేది మినీ వేలమే. కానీ వేలానికి ముందు జరిగే ట్రేడ్‌ డీల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై నవంబర్ 15 నాటికి క్లారిటీ రానుంది. ఇక ఈసారి అన్ని ఫ్రాంఛైజీల ఆసక్తి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై ఉంది. గాయం కారణంగా గత సీజన్‌కు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో అతడి కోసం ఫ్రాంఛైజీలు కోట్లు గుమ్మరించొచ్చు. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్ 2026కు సంబంధించిన మెగా వేలం నవంబర్ 27న జరగనుంది. ఇప్పటికే టోర్నీలోని ఐదు ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి.

IPL లో ట్రోఫి కొట్టని ఢిల్లీ క్యాపిటల్స్..

ఇక ఇది ఇట్ల ఉంటే.. ఇక 2009లో డక్కన్ చార్జర్స్ టైటిల్ గెలుచుకుంది. ఈ ఏడాది ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడగా.. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్ల కల ఇంకా తీరలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *