Big twist in TV anchor's Swetcha Votarkar case

ఎప్పుడు నవ్వుతూ ఉండే స్వేచ్ఛకు స్వేచ్ఛ లేకుండా చేసింది ఎవరు..?

ఆత్మహత్య చేసుకునేంతలా.. స్వేచ్ఛకు భంగం కలిగించింది ఎవరు..?

నిజంగా స్వేచ్ఛది ఆత్మహత్యనా..? హత్యనా..?

నాన్న వాడిని వదలొద్దు అంటూ స్వేచ్ఛ మాటలు

స్వేచ్ఛకు పూర్ణచంద్రరావు తో సంబంధం ఉందా..?

పూర్ణచంద్రరావు స్వేచ్ఛతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా..?

నిజంగా స్వేచ్ఛ తండ్రి చెప్పినట్లే పూర్ణచంద్రరావు వల్లే ఆత్మహత్య చేసుకుందా..?

స్వేచ్ఛ (Swetcha Votarkar)… ఎప్పుడు వార్తలు చదువుతూ సమాజంలో జరిగే మంచి చెడుల గురించి, ప్రజలకు చెప్పే స్వేచ్ఛ ప్రస్తుతం మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement) తనదైన స్టైల్ లో పోరాడిన వీర మహిళ. తెలంగాణ ఉద్యమంలో తన కవితలతో… నా తెలంగాణ అనే వ్యాసాలతో సీమాంధ్రుల చురకలు అంటించిన రచయిత. ఉద్యమ అనంతరం రాష్ట్రం వచ్చింది… మన పని అయిపోయింది అని అనుకోకుండా… తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీడియా రంగంలోకి అడుగు పెట్టింది. ప్రజలకు న్యాయం చేయ్యాలంటే… ప్రజల తరఫున ప్రశ్నించేందుకు మీడియా సరైన వేదిక అని నమ్మి.. ధర్మం నాలుగు పాదాలపై నడిచేందుకు ముఖ్య పిల్లర్ అయిన మీడియా రంగంలోకి వచ్చి సమాజానికి మరింత సేవ చేద్దాం అనుకున్న స్వేచ్ఛకు.. స్వేచ్ఛ లేకుండా చేసింది ఎవరు..?

నిజాన్ని గిగ్గచ్చిగా చెప్పే స్వేచ్ఛ.. ఆత్మహత్య చేసుకుంటుందా..?

ప్రస్తుతం తెలంగాణలో (Telangana) ఎవరిని కదిలించినా టీవీ యాంకర్ ( TV Anchor), ఉద్యమ కారిని స్వేచ్ఛ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రముఖ న్యూస్ ఛానెల్.. టీవీ యాంకర్, ప్రముఖ జర్నలిస్ట్, రచయిత్రి, వక్త అయిన స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య హత్యపై మీద అనేక మంది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఎంతో ధైర్య వంతురాలు.. ఆమె ఇలాంటి పని ఎందుకు చేస్తుంది..? ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది..? తెలంగాణ ఉద్యమ సమయంలో చావుకు ఎదురెళ్లి రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న స్వేచ్ఛ.. ఆత్మహత్య చేసుకుంది అంటే ఎవరైనా నమ్ముతారా..? అని తోటి మీడియా మిత్రులు ప్రశ్నిస్తున్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ స్వేచ్ఛకి పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తరువాత.. కూతురుతో పాటు ఉంటున్న స్వేచ్ఛ‌తో కొన్నాళ్లుగా పూర్ణ చంద్రరావు (Poorna Chandra Rao) అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి వల్లే… స్వేచ్ఛ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది అని అంటున్నారు.

స్వేచ్ఛది హత్యనా..? ఆత్మహత్యనా..?

స్వేచ్ఛ తండ్రి తాజాగా తన కూతురి ఆత్మహత్య (Suicide) ఘటనపై స్పందించారు. తన కూతురు ఇలా చేసుకోవడానికి కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. గత కొన్ని రోజులు వారిద్దరూ కలిసి ఉంటున్నారని తెలిపారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని ఆయన అన్నారు. పెళ్ళికి మాత్రం నిరాకరించాడని, ఆ విషయంలోనే తన కూతురు మనస్థాపం చెంది ఉంటుందని స్వేచ్ఛ తండ్రి చెప్పుకొచ్చారు. ఇక జూన్ 26న పూర్ణ చందర్ రావు గురించి తనతో మాట్లాడింది అని తండ్రి చెప్పారు. “ఆయనతో కలిసి ఉండలేను నాన్నా.. అతడిని కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. జూన్ 26 కు ముందు..స్వేచ్ఛ పూర్ణ చంద్రరావుతో గొడవ పడినట్లు తండ్రి చెప్పారు. పెళ్లి విషయంలో యాంకర్ స్వేచ్ఛ చాలా సార్లు పూర్ణచంద్రరావుతో గొడవలు పడేదని వెల్లడించారు. పూర్ణచంద్రరావుని (Poorna Chandra Rao) పెళ్లి చేసుకోమని యాంకర్ స్వేచ్ఛ ఒత్తిడిచేయడంతో.. అతను పెళ్లికి నిరాకరించాడని.. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని.. ఈ కారణమే ఆమె ఆత్మహత్యకి కారణం అని ఆమె తండ్రి ఆరోపణలు చెస్తున్నారు.

స్వేచ్ఛ కూతురు తో చివరిగా చెప్పిన విషయాలు ఏంటి..?

ఇక స్వేచ్ఛ తన కూతురితో చివరిగా మాట్లాడిన విషయాలు ఇవే… నీ వద్దకు తాత వస్తున్నాడు. జాగ్రత్త అంటూ స్వేచ్ఛ తన కూతిరికి చివరిగా చెపినట్లు తన కూతురు వెల్లడించింది. ఎప్పుడు కూడా స్వేచ్ఛ తన కూతురికి పదే పదే నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. నీకు ఎవరు లేకపోయినా చివరి వరకు నేను నీతో ఉంటా అని పదే పదే చెప్పిందటా. కానీ ప్రస్తుతం స్వేచ్ఛ కూతురి మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. నన్ను స్ట్రాంగ్ చేసి మా అమ్మ వెళ్లిపోయింది. ఇక చివరిగా మా అమ్మ నాకోసం ఒక కవిత రాసింది అంటూ వెల్లడించింది.

కూతురిపై స్వేచ్ఛ కవిత…

కడుపులోంచి బిడ్డ బైటపడి చేతుల్లోకి తీసుకొని గుండెలకద్దుకున్నప్పుడు చిన్ని ప్రాణం.. చిన్ని ముఖం.. ఎంత చిన్నగా ఉంది. నా చేతుల్లో అనుకున్నాం.. రాత్రంతా మేల్కొనే ఉండి చూస్తునే ఉన్నాం..
ఈ చిన్న ముఖం నా చేతుల్లో ఎప్పుడు నిండుతుందా అని.. ఇప్పుడు దోసిలి నిండా పువ్వు ముఖం కూడా నా బిడ్డ నవ్వు ముఖం లాగా..

ఇక ఇలా అందరికీ స్వేచ్ఛగా వార్తలు చదివి వినిపించిన మన స్వేచ్ఛ. సమాజానికి తన వంతు సేవ చేసి స్వేచ్ఛగా.. పరలోకానికి వెళ్లిపోయింది. ఇప్పుడు మన అందరి మధ్యలో లేకపోవడం ఎంతో భాదను కలిగిస్తుంది. ఏది ఏమైనా… స్వేచ్ఛ మరణానికి కారణమైన వారిని చట్టం కచ్చితంగా శిక్షించాలి.

స్వేచ్ఛ కు శాంతి కలగాలని మరో సార్ BRK న్యూస్ తరఫున నివాళి అర్పిస్తున్నాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *