దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. డిజిటల్ పేమెంట్స్ కి జనం బాగా అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులే. కూరగాయల నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు.. ఇటూ చాయ్ తాగిన, చాక్లెట్ కొన్న, సిగరెట్ తాగిన ఇట్టే ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం ఇలా యూపిఐ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. నిజాని యూపీఐ భారతీయుల జీవితంలో ఒక భాగంగా మారింది. తాజాగా దీనికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడూ UPI సేవలు ఉచితంగా ఉండదని యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లుగా మన యూపీఐ పేమేంట్స్ ని ఫ్రీగా చేసుకున్నాం.. కానీ ఇక ముందు అలా కుదరదు వెల్లడించింది. అయితే ఈ యూపీఐ చార్జీలు నేరుగా విధించకుండా.. వ్యాపారుల నుంచి మాత్రమే చార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులు సిద్ధం అయ్యాయి. అతి త్వరలోనే ఈ చార్జీలు వినియోగదారుల పైకి బదిలీ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది.
మరి కొన్ని రోజుల్లోనే.. యూపీఐ పేమెంట్స్ భవిష్యత్ కీలక మలుపు తిరగబోతుంది అని చెప్పాలి. అవును మీరు విన్నది నిజమే.. ఈ లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి చార్జీలు వసూలు చేయాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయి.
ఇక విషయంలోకి వెళ్తే…
UPI ప్రస్తుతం యూపీఐ లాంటి ఆన్లైన్ చెల్లింపులను పూర్తిస్థాయిలో ఉచితంగా చేస్తున్నాం. అయితే ఇకపై డిజిటల్ లావాదేవీలు ఎక్కువకాలం ఫ్రీగా లభించకపోవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) కొత్త దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆర్థికంగా ఈ వ్యవస్థను స్థిరంగా కొనసాగాలంటే ఛార్జీల అమలు అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం బీఎఫ్ఎస్ఐఐ సమ్మిట్లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం యూపీఐ ఎలాంటి యూజర్ ఛార్జీలు లేకుండా కొనసాగుతోంది. అయితే, ఈ వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం బ్యాంకులు, ఇతర లావాదేవీ సంస్థలకు సబ్సిడీ ఇస్తోంది. చెల్లింపులు, నగదు అనేవి వ్యవస్థకు జీవనాడి లాంటివి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి యూపీఐ విధానంలో చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు విధించడంలేదు. అందుకోసం బ్యాంకులు, ఇతర వాటాదారులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే అదనపు ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ ఖర్చులు క్రమంగా భారంగా మారుతున్నాయి. సురక్షితమైన డిజిటల్ చెల్లింపులకు భారత్ కట్టుబడి ఉంది. కానీ దీర్ఘకాలంలో ఇది స్థిరంగా కొనసాగాలంటే ఖర్చులు చెల్లించక తప్పదు. అందుకు ప్రభుత్వమైనా, ప్రజలైనా ఎవరో ఒకరు భరించాల్సిందే. కాబట్టి ప్రస్తుతం చెల్లింపుల ఖర్చులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎక్కువకాలం కొనసాగకపోతే, ప్రజలే దాన్ని భరించాలి. గడిచిన రెండేళ్ల కాలంలో దేశీయంగా రోజూవారీ లావాదేవీలు 31 కోట్ల నుంచి 60 కోట్లకు రెట్టింపు అయిన నేపథ్యంలోనే ఆర్బీఐ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జీరో ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేటు) విధానం కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం అంతిమంగా ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
ఎన్టీఏతో అనేక రంగాలకు ప్రయోజనం..
ఇదే కార్యక్రమంలో బ్యాంకింగ్ సంస్కరణల గురించి మాట్లాడిన ఆయన.. గతంలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. భవిష్యత్తులోనూ అలాంటి నిర్ణయం వల్ల ఆర్థికపరమైన ఫలితాలను ఇస్తాయంటేనే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే, గురువారం ఖరారైన భారత్-యూకే చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్ ఏ) సంజయ్ మల్హోత్రా స్వాగతించారు. ఇలాంటి ఒప్పందాల వల్ల ఆర్థికవ్యవస్థలోని అనేక రంగాలకు ప్రయోజనాలుంటాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య కొరవడుతున్న సంబంధాల మధ్య భారత్ చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు ఎంతో మేలు చేస్తాయన్నారు.