- ICICI Bank ఖాతాదారులకు బిగ్ షాక్..
- ఐసీఐసీఐ బ్యాంకులో భారీగా పెరిగిన నెలవారీ బ్యాలెన్స్
- ఈ నెల 1 నుంచి తెరిచే కొత్త సేవింగ్స్ ఖాతాలకు వర్తింపు
- పట్టణ, మెట్రో ప్రాంతాల్లో రూ. 50,000 తప్పనిసరి
- పాత ఖాతాదారులకు యథాతథంగా కొనసాగనున్న నిబంధనలు
- ఇక పై మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే.. ఫైన్స్ తప్పవా..?
- కనీస బ్యాలెన్స్ లేకపోతే రూ. 500 వరకు జరిమానా ICICI Bank
ICICI Bank : ఐసీఐసీఐ మీనిమం బ్యాలెన్స్ ఇక నుంచి 50 వేలు..
ICICI Bank కస్టమర్లకు బిగ్ షాక్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అని చేప్పాలి. ICICI Bank ఖాతా దారులు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కీలక అప్డేట్ ఇచ్చింది.ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రైవేట్ రంగానికి చెందిన ICICI Bank కనీస బ్యాలెన్స్‌ను పెంచేసింది. ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) తన సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో భారీ పెంపు చేస్తున్నట్లు ICICI Bank ప్రకటించింది. ప్రస్తుతం ICICI Bank లో ఖాత ఒపెన్ చేసిన ప్రతి కొత్త కస్టమర్లకు ఈ రూల్ వర్తించనున్నది అని వెల్లడించింది. కాగా ఈ రూల్ కూడా ఈ నెల అంటే ఆగస్టు 1 తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చింది అని చల్లగా చావు కబురు చెప్పింది. ఇక ఈ కొత్త నిబంధనల ప్రకారం.. మెట్రో నగరల్లో.. అర్బన్ నగరల్లో ఉన్న కస్టమర్లు వర్తిస్తుంది. ఇక నుంచి తమ సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను 50 వేలు మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు ఇక నుంచి పెనాల్టీలు తప్పించుకోవాలంటే సచ్చినట్లు 50 వేల బ్యాలెన్స్ మెయరింటేన్ చేయ్యాల్సిందే. ఇక మరో వైపు ఇదే ICICI Bank పాత కస్టమర్లకు కాస్త ఉపసమనం కలిగించినట్లు అయింది. పాత కస్టమర్లు ఈ బ్యాంక్ లో.. బ్యాంక్ బ్యాలెన్స్ 10వేలు మాత్రమే ఉంచింది. ఇక రూరల్ ,సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న పాత కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ 5వేలుగా ఉంది. కనీస బ్యాలెన్స్ మెయింటేన్ చేయని వారు ఆరు శాతం ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలో మూడు సార్లు ఉచితంగా క్యాష్ డిపాజిట్ కోసం అవకాశం కల్పించారు. ఆ తర్వాత ప్రతి ట్రాన్‌జాక్షన్‌కు 150 చెల్లించాల్సి ఉంటుంది. కాంప్లిమెంటరీ క్యాష్ విత్‌డ్రాలను నెలకు మూడుసార్లు మాత్రమే చేశారు. సేవింగ్స్ అకౌంట్‌లో థార్డ్ పార్టీ క్యాష్ డిపాజిట్ ప్రతి ట్రాన్‌జాక్షన్‌కు 25వేలుగా ఫిక్స్ చేశారు.
కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం.. మెట్రో, అర్బన్ ప్రాంతాల ఖాతాదారులు సగటున 50,000 కనీస నిల్వ ఉంచాలి. ఇది ఇంతకుముందు ఉన్న 10,000 నుంచి 50,000 కు పెరగడంతో.. ఐదు రెట్లు పెరిగినట్టే. సెమీ-అర్బన్ బ్రాంచ్లో కనీస బ్యాలెన్స్ 5,000 నుంచి 25,000కు పెరిగింది. అలాగే గ్రామీణ బ్రాంచ్లలో మాత్రం 2,500 నుంచి 10,000కు పెంచారు. ఇకపోతే, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా రద్దు చేసింది. ఇతర బ్యాంకులు సాధారణంగా 2,000 నుంచి 10,000 వరకు మాత్రమే MAB ఉంచేలా నిబంధనలు అమలు చేస్తుంటాయి. ఉదాహరణకు, ఇటీవల HDFC లిమిటెడ్ విలీనం తరువాత ఆస్తుల పరంగా అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు మారిన హెచ్ఎఫ్ సీ బ్యాంక్ MABను మెట్రో, అర్బన్లో 10,000, సెమీ-అర్బన్ 5,000, గ్రామీణ బ్రాంచ్లలో 2,500గా ఉంచింది. బ్యాంకులు తమ రోజువారీ కార్యకలాపాలు, పెట్టుబడుల ఖర్చులను తీర్చుకునేందుకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తాయి. ఈ పరిమితి కంటే తక్కువ నిల్వ ఉంచిన ఖాతాదారులపై జరిమానాలు కూడా వేస్తుంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత సవరించిన ఫీజు చార్ట్ ప్రకారం జరిమానాలు విధించనుంది.