Big alert for UPI users.. new rules from August

UPI యాప్లో AUG 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఫోన్ నంబర్కు లింకై ఉన్న బ్యాంక్ ఖాతాలను రోజుకు 25సార్లు మాత్రమే చూడవచ్చు. అలాగే ఆటో పే ట్రాన్సాక్షన్సు ఫిక్స్డ్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. పేమెంట్ డిలేస్, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ను తగ్గించేందుకు NPCI ఈ రూల్స్ తీసుకొస్తోంది. ట్రాన్సాక్షన్స్ లిమిట్లో ఎలాంటి మార్పు చేయలేదు.

NPCI కొత్త రూల్స్..

UPI .. ఈ పదం తెలియని వాళ్లు.. ఈ లావాదేవీలు వాడని వాళ్లు అంటూ ఉండరేమో. మార్కెట్లో ప్రముఖంగా యూపీఐ సేవలు కొనసాగిస్తున్న యాప్స్‌లో పేటీఎం, ఫోన్ పే, జీ పే, భీమ్ వేదికలను యూజర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత దేశంలో ఫోన్‌లో డబ్బు ట్రాన్సాక్షన్స్ ఎక్కువైన నేపథ్యంలో వాటికి సంబంధించిన కొన్ని మార్పులను తెలుసుకోవడం ఉత్తమం. ప్రస్తుతం మీరు అన్ని లావాదేవీలు యూపీఐతోనే చేస్తున్నారా..? ఇక నుంచి వాటిన్నింటికి చెక్ పెడుతూ.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ తీసుకురాబోతుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI). అవును నిజంగా.. NPCI మరో కొత్త నిబంధనల తీసుకురాబోతుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఇకపై యూపీఐ యూజర్లు బ్యాలెన్స్ చెక్ చేయలన్నా లేదా ఆటోపే లేదా రోజువారీ ట్రాన్సాక్షన్ల చేయాలన్నా పరిమితులు ఉంటాయి. యూపీఐ సర్వీసులను వేగవంతం చేయడంతోపాటు సిస్టమ్ పై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది.

ఇక NPCI తీసుకోచ్చిన కొత్త రూల్స్ ఎవో తెలుసా..?

ఆగస్టు 01, 2025 నుంచి యూపీఐ యాప్‌లలో రోజుకు 50 సార్లు మాత్రమే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. సిస్టమ్ పై అదనపు ఒత్తిడిని నివారించేందుకు ఈ నిబంధనను తీసుకువస్తున్నారు. మీ మొబైల్ నంబర్‌కు ఏ బ్యాంక్ ఖాతాలు లింక్ చేయబడ్డాయో మీరు రోజుకు 25 సార్లు మాత్రమే చూడగలరు. నెట్ ఫ్లిక్స్, SIP మొదలైన ఆటో డెబిట్ పేమెంట్లు బిజీగా లేని సమయాల్లో మాత్రమే జరుగుతాయి. ఉదయం పది గంటల ముందు ఒకసారి, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9: 30 గంటల తర్వాత ఈ ఆటో ఫేమెంట్లు చేసుకోవచ్చు. అలాగే మీ పేమెంట్ ట్రాన్షిక్షన్ ఆగిపోతే.. మీ స్టేటస్ కేవలం మూడు సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు. ప్రతి పేమెంట్ స్టేటస్ చెక్ మధ్య 90 సెకన్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది. యూపీఐ లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, సర్వర్లపై భారాన్ని తగ్గించి, సిస్టమ్ స్థిరత్వాన్ని, వేగాన్ని, విశ్వసనీయతను పెంచడం ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుత UPI ట్రాన్సాక్షన్ లిమిట్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *