Ashok Gajapathi Raju sworn in as Governor of Goa

గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా (Goa) గవర్నర్‌ బంగ్లా దర్బార్‌ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు.

గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం..

ఏపీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో పనిచేసిన సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇవాళ గోవా గవర్నర్ గా ( Goa Governor) బాధ్యతలు చేపట్టారు. గోవా రాజ్ భవన్ (Raj Bhavan) లో జరిగిన ఓ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) గవర్నర్ గా బంగ్లా దర్బార్‌ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ (Laxmikant Parsekar), రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు (Rammohan Naidu), ఏపీ మంత్రి లోకేశ్‌తోపాటు టీడీపీ ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు.

ఈనెల 14న గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతి రాజు నియమితులైన విషయం తెలిసిందే. పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై స్థానంలో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అశోక్‌ 2014 నుంచి 2018 వరకు మోదీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా వ్యవహరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *