Are you using headphones too much? But are your ears in danger?

హెడ్ ఫోన్స్… (Headphones) ప్రస్తుతం మొబైల్ (Mobile) తో పాటు హెడ్ ఫోన్స్ వినియోగం భారీగా పెరిగింది. ఎక్కడకి వెళ్లినా మన వెంట మర్చిపోని వస్తువుల్లో సెల్ ఫోన్, హెడ్ ఫోన్స్ ముందు వరుసలో ఉంటాయి. ఫోన్ మాట్లాడిన, మ్యూజిక్ (Music), సినిమాలు దేనికైనా హెడ్ ఫోన్స్ కావాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే… ఈ రోజుల్లో ఇయర్‌ ఫోన్స్‌ శరీరంలో భాగమైపోయాయి. చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకునే గడుపుతున్నారు.

ఇక గత కరోన వల్ల ప్రస్తుతం తల్లి దండ్రులే తమ చెతులారా హెడ్ ఫోన్స్ ఆన్‌లైన్‌ క్లాసులు (online classes), వర్క్‌ ఫ్రం హోం అంటూ అదే పనిగా ఇయర్‌ ఫోన్స్‌ ఉపయోగిస్తున్నారు. కొంతమంది ప్రయాణాల్లో, ఆఫీసులకు వెళ్లేప్పుడు ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటుల ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే వాటిని ఉపయోగించే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. జాగ్రత్తలు తీసుకోకుండా.. ఇయర్‌ ఫోన్స్‌ ఉపయోగిస్తే.. వినికిడి సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని అంటున్నారు. నిజానికి హెడ్ ఫోన్స్ మన చెవుల్లో బ్యాక్టీరియాను పెంచుతాయని మీకు తెలుసా..? ఢిల్లీలో ఒక అమ్మాయికి జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.1 బిలియన్ యువతకు పెద్ద శబ్దంతో సంగీతం వినడం వల్ల వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) (WHO) హెచ్చరించింది. 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువత.. సంగీతం వినడానికి ఇయర్‌ఫోన్‌లు వాడుతుంటే.. వారిలో దాదాపు 50 శాతం మంది ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్‌ వింటున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. వీరికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక వెల్లడించింది. కొందరైతే రోజులో దాదాపు 8-10 గంటలు వీటిని వాడుతున్నారు. అయితే ఈ అలవాటు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల ఓ మహిళ ఢిల్లీకి వెళ్తుండగా దాదాపు 8 గంటలు హెడ్ఫోన్స్ వాడింది. తర్వాత రోజు నుంచి ఎడమ చెవి సరిగ్గా వినిపించకపోవడంతో ఆస్పత్రికి వెళ్లింది. చెక్ చేశాక హెడ్ ఫోన్ ఎక్కువగా వాడటంతో 45% వినికిడి లోపం ఏర్పడినట్లు తేలింది. ఇక ఈ హెడ్ ఫోన్స్ వల్ల… బ్యాక్టీరియా వస్తుందని తెలింది. తరచు హెడ్ ఫోన్స్ వాడటం వల్ల బ్యాక్టీరియా చెవిలోకి సులభంగా ప్రవేశిస్తుందనే విషయాన్ని మాత్రం పట్టించుకోరు. హెడ్ ఫోన్స్‌కి అంటుకునే దుమ్ము, ధూళి చెవిలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అందుకే హెడ్ ఫోన్స్ తీసాకా చెవిని శుభ్రం చేసుకోవడం మర్చిపోకూడదు. చెవిలో బ్యాక్టీరియా చేరితే ఒకలాంటి ఇరిటేషన్‌తో పాటు అసౌకర్యంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. చెవిలో ఏదో ఉందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతో చాలామంది హెడ్ ఫోన్స్ వాడటం మానేస్తుంటారు. చెవిలో చేరిన బ్యాక్టీరియా (bacteria) కారణంగా అలా జరుగుతుందట.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *