Another terrible virus in China.. 7 thousand cases registered per month

  • దోమ పై “బ్రహ్మాస్త్ర”
  • చైనాలో మరో కొత్త వ్యాధి..
  • డ్రాగన్ కంట్రీని వణికిస్తున్న దోమలు
  • ఒక నెలలో 7000 కేసులు నమోదు
  • కరోనా కంటే 100 రెట్లు వేగంగా వ్యాప్తిస్తున్న కొత్త వ్యాధి..
  • చైనా చరిత్రలోనే అతి వేగంగా వ్యాపిస్తున్న వ్యాధిగా రికార్డు
  • దోమల నివారణకు రంగంలోకి దిగిన చైనా సైన్యం..
  • మీ ఇంటి పక్కన నీళ్లు ఆగితే.. మీకు 10 వేలు ఫైన్ అంటున్న చైనా
  • అప్పుడు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.. ఇప్పుడు దోమల పై బ్రహ్మాస్త్రం

భారత్ పొరుగు దేశం.. చైనాలో మరో వైరస్ వేగంగా వ్యాప్తిస్తుంది. ఇప్పటికే చైనా దేశం వరదలతో విలవిల లాడుతుంది. చైనా జల ప్రళయంలో మునిగిపోయింది. అలా వరదల నుంచి కొలుకుందో లేదు ఇలా.. మరో మహమ్మారి చైనాలో వ్యాపించింది. అది కూడా ఎంతలా అంటే.. ఒక్క నెలలోనే దాదాపు 7000 వైలకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి.

ఇక విషయంలోకి వెళ్తే..

డ్రాగన్ కంట్రీ లో దొమల బెడదతో కొత్త వైరస్ పుట్టుకోచ్చింది. దక్షిణ చైనా ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ ఫోషన్‌ నగరంలో ప్రభుత్వం వైరస్‌పై యుద్ధం ప్రకటించింది. అక్కడ కొవిడ్‌ తరహాలో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. కేవలం నెల రోజుల్లోనే 7,000 పైగా గన్యా కేసులు నమోదయ్యాయి. గత 20 ఏళ్లలో చైనాలో ఇంత వేగంగా వ్యాధి వ్యాపించడం ఇదే తొలిసారి. 2008లో ఈ స్థాయిలో వైరస్‌ వ్యాపించింది. ఎంతాల అంటే.. కోవిడ్ కంటే కూడా ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో సైన్యాన్ని రంగంలోకి దింపి.. రక్షణచర్యలు చేపట్టింది చైనా ప్రభుత్వం.
దొమలను గుర్తించేందుకు చైనా ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం పని ఏంటి అంటే.. దొమలు ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి నివారించడమే వాళ్ల పని. దీంతో దోమలపై దండయాత్రకు సిద్దమైంది. ఆ వైరస్‌ ని అంతం చేయడానికి వీధులను ఫాగింగ్‌తో పూర్తిగా క్రిమిసంహారకంగా చేస్తోంది. దోమలతో వైరస్‌కు చెక్ పెడతామనుకుంటున్నారు.

దోమల నివారణకు.. సైన్యం

దీంతో దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. ఇక పరిశోధకులు భారీ ఎలిఫెంట్ దోమలను కూడా రంగంలోకి దించారు. వీటితోపాటు దోమలను తినే ప్రత్యేక రకమైన 5,000 చేపలను కాల్వల్లోకి వదిలారు. వీటి అసలు పేరు ‘టెక్సోరెంకైటిస్‌’. ‘ఎలిఫెంట్‌ మస్కిటో’ అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దోమ జాతి ఇదే. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో ఎక్కువగా జీవిస్తుంటాయి. వీటిల్లో దాదాపు 90 రకాలు ఉన్నాయి. వీటికి ప్రధానంగా అడవులే ఆవాసం. 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. వీటిలో చాలారకాల వల్ల మనుషులకు ప్రమాదం లేదు. సాధారణంగా ఆడదోమలు మన రక్తాన్ని తాగుతాయి. కానీ చాలారకాల ఎలిఫెంట్‌ మస్కిటోలు ఆడవైనా సరే మొక్కలు, చెట్ల రసాలను పీల్చే బతుకుతాయి. వీటికి కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం అవసరం. రాత్రి వేళల్లో పడుకొంటాయి. వీటి ఆడదోమలు నీటి ఉపరితలం మీద గుడ్లు పెడతాయి. సాధారణ దోమలు కూడా ఇలాంటి ప్రదేశాల్లోనే సంతానోత్పత్తి చేస్తాయి. ఎలిఫెంట్‌ మస్కిటోల గుడ్ల నుంచి కేవలం 40 నుంచి 60 గంటల్లోనే లార్వాలు బయటకు వస్తాయి. అవి సమీపంలోని సాధారణ దోమల గుడ్లు తిని పెరుగుతాయి. ఒక్క లార్వా కనీసం 100 దోమల గుడ్లను తింటుంది. దీంతో ఇతర దోమల సంతానం పెరగదు. ఇక ఎవరైనా తమ ఇంటి ప్రాంగణంలో నిలిచిపోయిన నీటిని తొలగించకపోతే ఆ నివాసితులకు 10,000 యువాన్ల వరకు జరిమానా విధించబడుతోంది. దక్షిణ చైనాకు CDC లెవల్ 2 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

దోమపై బ్రహ్మాస్త్రం…

మీరు చిన్నప్పుడు మీ పాఠ్యం పుస్తకంలో… పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే పేరు వినే ఉంటారు. 1950లో చైనా దేశంలో వరి ధాన్యం విషయంలో అక్కడి అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడి.. ఆ నేరాన్ని ముగ జీవులు అయిన పిచ్చుకపై నెట్టడంతో అప్పటి ప్రభుత్వం గుడ్డిగా అధికారులు చెప్పిన మాటలు విని.. యావత్ చైనా వ్యాప్తంగా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం చైనా చేసేది కూడా అదే అని చెప్పాలి. కానీ ఇప్పుడు చైనా చేస్తుంది “దొమపై బ్రహ్మాస్త్రం” అని చెప్పాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *