Another letter from BRS Party MLC Jagruti Party President Kavitha

గత కొంత కాలంగా తెలంగాణ లో కవిత పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏ పార్టీ నేతలైన కూడా కవిత రాజకీయ భవిష్యత్తు పై ఎవరికి వారే చర్చలు పెట్టుకుంటున్నారు. గతంలో కేసీఆర్ కు కవిత రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. తాజాగా మరో సారి కవిత లేఖ వైరల్ గా మారింది.

ఇక విషయంలోకి వెళ్తే..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటిదాకా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమెను ఆ స్థానం నుంచి తప్పించారు. బుధవారం తెలంగాణభవన్లో నిర్వహించిన టీబీజీకేఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటికే ఆయన్ను టీబీజీకేఎస్ ఇన్చార్జిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ సమావేశం నిర్వహించారని ఫైర్ అయ్యారు.

కవిత లేఖ ను ఒక సారి చూద్దాం రండి..

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నిక కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ఫ్యామిలీలో మరో చిచ్చురేపింది. తనను అధ్యక్షురాలిగా తొలగించి.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అధ్యక్షుడిగా నియమించడంపై కవిత భగ్గుమన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారని ఫైర్ అయ్యారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్‌ లో ఈ ఎన్నిక నిర్వహించడాన్ని కూడా ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందన్నారు. ఈ మేరకు కార్మికులకు లేఖ రాశారు. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి గతంలో కేసీఆర్ కు రాసిన లేఖను లీక్‌ చేశారన్నారు. ఆ కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే తనపై కక్షగట్టారని ఆరోపించారు. ఆ కుట్రదారులు తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు కవిత ఈ రోజు లేఖ రాశారు. పదేళ్లుగా తను ఈ సంఘానికి గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ కార్మికులకు సేవ చేశానన్నారు. ఈ అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రతీ కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా సేవలందించానన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేశానన్నారు. ఈ క్రమంలో తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

అయితే.. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్‌ ను ఒప్పించి తిరిగి డిపెండెంట్‌ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్దరించేలా చేశానని గుర్తు చేశారు. తన పోరాటంతో సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానన్నాను. కార్మికుల క్వార్టర్స్‌ కు ఉచిత కరెంట్‌, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించానని గుర్తు చేశారు. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్‌ గ్రాంట్‌ పది రెట్లు పెంచేందుకు కృషి చేశానన్నారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మికుల పిల్లలకు ఫీ రీయింబర్స్‌ మెంట్‌ అందేలా చేశానన్నారు.

కవితను ఇప్పటికే బీఆర్ఎస్ పెద్దలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. ‘కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నయ్’ వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. చిలికిచినికి గాలివానలా ముదిరింది. ఆ తర్వాత నేరుగా ఆమె తన అన్న కేటీఆర్ను టార్గెట్ చేసుకుంటూ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేశారంటూ బాంబు పేల్చారు. అంతేకాదు.. ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా తనపై కుట్రలు పన్నారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు మరోసారి కవిత బహిరంగంగా ఫైర్ అయ్యింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *