America's Golden Dome... What is this dome system really like?

Golden Dome : అమెరికా గోల్డెన్ డోమ్… అసలేంటీ ఈ డోమ్ వ్యవస్థ..?

అసలు ఈ గోల్డెన్ డోమ్ అంటే ఏంటి…? అసలు ఆ డోమ్ ఏం చేస్తుంది…? డోమ్ దేశాన్ని ఎలా రక్షిస్తుంది…? మరి ఆ డోమ్ ఏంటిది… ? దాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది… ? వాస్తవానికి అమెరికా వంటి పెద్ద దేశం వ్యాప్తంగా డోమ్ నిర్మించడం సాధ్యమవుతుందా..? ఏ సంవత్సరానికి ఆ డోమ్ నిర్మాణం పూర్తి అవుతుంది. ఇలా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి.

భద్రత అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. అది నీకా నాకా అనే తేడా ఉండదు. అందరికి ఒకే విధంగా.. అందరికి రక్షణ గా ఉండే వ్యవస్థను అమెరికా తయారు చేయబోతుంది. ఏంటి అర్ధం కాలేదు కదూ… అయితే అగండి అక్కడికే వస్తున్నా… తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా దేశ వ్యాప్తంగా.. గోల్డెన్ డోమ్ ను నిర్మించనున్నారు అగ్రరాజ్య పెద్దన్న ట్రంప్.

దేశ రక్షణే నా తొలి ప్రాధాన్యత…

దేశ రక్షణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ చేసిన హామీలను వరుస పెట్టి ఒక్కొక్కటిగా అమలు పరుస్తు వస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో చెప్పిన విధంగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. ప్రపంచ దేశాలపై సుంకాలు విదిస్తామన్న మాటకు ట్రంప్ కట్టుబడి ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్, చైనా వంటి ఆర్ధిక దేశాలతో సహా ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాలు అమలు తెలిసిందే. ఇక తాజాగా… ట్రంప్ దేశ భద్రత అంశంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే… అమెరికా భద్రత కోసం ఇజ్రాయేల్ ఐరన్ డోమ్ మాదిరిగా ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

గోల్డెన్ డోమ్ అంటే ఏంటి…? అసలు ఆ డోమ్ ఏం చేస్తుంది…?

డోమ్ అంటే… ఒక ప్రదేశాన్ని రక్షిస్తూ ఉండే కవచం అన్నమాట. అవును… మనం డోమ్ అంటే గుండ్రంగా ఉండి… ఆ ప్రదేశం పై లేదా ఆ ప్రాంతం ఇతర దాడుల నుండి రక్షిస్తుంది. అంటే ఇతర దేశాలతో యుద్దం జరుగుతున్న సమయంలో… ఈ రక్షణ డోమ్ పని తీరు అర్ధం అవుతుంది. భూమి నుంచి అంతరిక్షం వరకు వ్యాపించే ఉండే గోల్డెన్ డోమ్‌ పేరుతో కొత్త తరం క్షిపణి నిరోధక వ్యవస్థ తయారుచేస్తామని.. అమెరికా వెల్లడించింది. అమెరికా సైనిక శక్తిని మరింత శక్తివంతం చేయనుందని తెలిపారు. ఈ గోల్డెన్ డోమ్‌ నిర్మాణం కోసం 175 బిలియన్ డాలర్లు ఖర్చువుతుందని తెలిపారు. ప్రారంభ నిధి కింద 25 బిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో రూ. 2 లక్షల కోట్లు) ఖర్చుచేయనున్నట్టు ట్రంప్ చెప్పారు. భూమి, సముద్రం, అంతరిక్షంలో ముందున్న ప్రమాదాల నుంచి అమెరికాను రక్షించే అత్యాధునిక టెక్నాలజీతో దీనిని రూపొందించబోతున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తులో అమెరికాను ఎవరూ ఏమీ చేయకుండా భారీ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోబోతున్నారు. అందులో భాగంగానే ఈ గోల్డెన్ డోమ్ నిర్మిస్తున్న అధ్యక్షుడు ట్రంప్. గోల్డెన్‌ డోమ్ వలన అంతరిక్ష దాడులను కూడా తప్పించుకోగలదు అమెరికా.

డోమ్ నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది..?

దీంతో ప్రపంచంలోనే అమెరికా అత్యంత రక్షణ వ్యవస్థ కలది అవుతోంది. ప్రస్తుతం…అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా వ్యాప్తంగా… 2029 నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అమెరికా రక్షణ రంగంలో ఉన్న లోపాలను లక్ష్యంగా చేసుకుని చైనా, రష్యా కొత్త తరహా క్షిపణుల దాడుల బెదిరింపులకు దిగే అవకాశముందని అమెరికా రక్షణ రంగ నిఘా సంస్థ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఉంది. దీంతో తన అధ్యక్ష పదవీకాలం ముగిసేలోగా గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని డోనల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్నారు.

SURESH

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *