టాలీవుడ్‌లో మరోసారి సంచలనం వార్త చక్కర్లు కొడుతోంది. జబర్దస్త్ ఫేమ్, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి పేరు ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమి తాజాగా విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక విషయంలోకి వెళ్తే..
సోషల్ మీడియా (Social media) తెలిసిన వారందరకి రీతూ చౌదరి (Ritu Chaudhary)పేరుతో గానీ ఆమె ఫేస్ తో గానీ పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెర నటుల్లో చాలా యాక్టివ్ గా ఉండే వాళ్లలో రీతూ కూడా ఒకరు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో (Bigg Boss Season 9) కంటెస్టెంట్ గా ఆట అడుతున్న ఈ అమ్మాడు.. బయట మాత్రం ఓ వీడియో తో తెగ వైరల్ అవుతుంది. అదేదో.. బిగ్ బాస్ వీడియోతో అంటే మీరు బ్రమ పడినట్లే.. తాజాగా రీతూ చౌదరి డ్రగ్స్ తీసుకుంటూ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
ధర్మ మహేష్ తో.. అక్రమ సంబంధం ఉందా..?
కొద్దిరోజుల క్రితం గౌతమి తన భర్త, టాలీవుడ్ (Tollywood) నటుడు ధర్మ మహేష్ (Dharma Mahesh) తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన మరో యువతితో అక్రమ సంబంధం (illicit relationship)పెట్టుకున్నాడని కూడా ఆరోపణలు చేసింది. అయితే ఆ అమ్మాయి పేరు చెప్పని గౌతమి, ఇప్పుడు సంచలనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న రీతూ చౌదరి పేరును బయటపెట్టి బాంబు పేల్చింది. దీంతో ఒక్క సారిగా అందరు షాక్ కి గురయ్యారు. గౌతమి (Gautami)షేర్ చేసిన వీడియోలలో ధర్మ మహేష్‌తో కలిసి రీతూ ఒక ఫ్లాట్‌లోకి వెళ్తున్న దృశ్యాలు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె షేర్ చేసిన చాట్స్‌లో “రీతూ గురించి అడిగితే నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్?” అనే సందేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య నిజంగా రిలేషన్ ఉందా..? లేక వేరే కారణం కోసం కలిశారా..? అనే చర్చ సోషల్ మీడియాలో ఎవరికి వారు రాసేసుకుంటున్నారు.
ధర్మ మహేష్ భార్య చేతిలో.. రీతూ చౌదరీ ప్రైవేట్ వీడియోస్..!
తాజాగా ధర్మ మహేష్ (Dharma Mahesh) భార్యా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. తన వద్ద ఇంటి లోపలికి వెళుతూ, బయటికి వస్తున్న వీడియోలే కాదు, వాళ్లిద్దరూ ఇంటిమేట్.. sex* వీడియోలు కూడా ఉన్నాయని బంబు పెల్చింది. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టే ఆ వీడియోలు బయట పెట్టడం లేదని ఆమె పేర్కొంది. దాదాపు రీతూ చౌదరీ (Ritu Chaudhary) మా ఇంటికి 30 సార్లు వచ్చింది. తాను, తన భర్త ఇద్దరం కలిసి సదరు ఇంట్లో అద్దెకు దిగామని, కాబట్టి ఆ ఇంట్లో తనకు కూడా అధికారం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆ అధికారంతోనే తనకు ఎక్కడ కావాలంటే అక్కడ సీసీ కెమెరాలు ఫిక్స్ (CCTV cameras fixed) చేశానని, అలా ఫిక్స్ చేయించినప్పుడే వీరి బాగోతం బయటపడిందని చెప్పుకొచ్చింది. అంతేకాక, రీతు చౌదరి బిగ్ బాస్ కు ఎంపికైనట్లు తెలిసిన తర్వాత కూడా తమ ఫ్లాట్ కి వచ్చి అతనితో సమయం గడిపిందని ఆమె పేర్కొంది. ఒక ఆడ, మగ మధ్య స్నేహం కూడా ఉండవచ్చు, కానీ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత లోపలికి వెళ్లడం, తెల్లవారుజాములోపు బయటకు రావడం వంటివి మామూలు స్నేహితులు చేసే పనేనా అంటూ ఆమె ప్రశ్నించింది. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది కాబట్టే లోకం కళ్ళు కప్పి దాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొంది. తన భర్తకు రీతు చౌదరితో కాకుండా, మరికొంతమంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లతో కూడా సంబంధం ఉందని గౌతమీ చౌదరి ఆరోపించింది.
సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరో.
ఇక ఈ ధర్మ మహేష్ విషయానికి వస్తే ఆయన సింధూరం, డ్రింకర్ సాయి (Drinker Sai) సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరికి కుమారుడు పుట్టాడు. కానీ, అప్పటి నుండి ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి, తాజాగా ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక రీతూ చౌదరి పేరు ఈ వ్యవహారంలో రావడంతో టాలీవుడ్ వర్గాల్లో, అభిమానుల్లో చర్చలు మరింత తీవ్రం అయ్యాయి. గౌతమి చూపించిన వీడియోలు, సాక్ష్యాలు నిజమా..? లేక వేరే ఉద్దేశంతో బయటపెట్టిందా..? అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.