A young woman in Andhra Pradesh committed suicide just six months after her marriage.

ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. చోటు చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్ ఏపీనే కుదిపేస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తున్న అక్క లేఖ.. తమ్ముడికి రాఖీ కట్టలేనేమో అంటూ కుమిలిపోయి అక్క శ్రీ విద్యా..! అరేయ్ తమ్ముడు.. ఈసారి నీకు నేను రాఖీ కట్టలే నేమో రా.. అంటూ లేఖ. భార్య అని చూడకుండా వీపుపైన పిడిగుద్దులు గుద్దుతు, జుట్టు పట్టుకుని గోడకు బాదుతూ చిత్రహింసలు చేస్తున్నారు. కట్టుకున్న భర్తే కాలయముడయ్యి.. 24 ఏళ్లకే నూరేళ్లు నింపుకున్న శ్రీ విద్యా. అమ్మ నాన్న వాడిని మాత్రం వదలొద్దు అంటూ భావోద్వేగంతో అంతిమ లేఖ.

ఆంధ్రప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ ఆత్మహత్య ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. తాజాగా పెళ్ళైన ఆరు నెలలకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

ఇక విషయంలోకి వెళితే..

కృష్ణా జిల్లా ఉయ్యూరులో 24 ఏళ్ల శ్రీ విద్యా ఎంఎస్సీ చదువుకుని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తుంది. భర్త ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. పెళ్ళైన నెల రోజుల నుంచే రాంబాబు శ్రీవిద్యను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. అందరి ముందు హేళనగా మాట్లడటంతోపాటు.. దారుణంగా కొట్టి.. చిత్రహింసలకు గురిచేసేవాడు.. ఇన్ని నెలలు రాంబాబు వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్న శ్రీవిద్యా ఇంట్లో వాళ్లకు చెప్పుకుని బాధపడేది.. ఈ క్రమంలోనే రాంబాబు వేధింపులు తీవ్రమవ్వడంతో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో శ్రీ విద్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీ విద్యా తల్లి తండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.. అయితే.. శ్రీ విద్య ఆత్మహత్య కేసులో విచారించే కొద్ది సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాంబాబు వ్యవహార శైలి, తన ప్రవర్తించిన తీరుపై సూసైడ్ నోట్ రాసి మరి శ్రీ విద్య ఆత్మహత్య చేసుకుంది.. తన భర్త.. కిరాతకుడని.. ఎలా పడితే అలా కొట్టే వాడని పేర్కొంది.

తాజాగా శ్రీ విద్యా సూసైడ్ నోట్ అందరినీ కన్నీరు పెట్టిస్తుంది.

‘‘నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను.. జుట్టు పట్టుకొని మంచాని కి వేసి కొడుతుండడంతో తలంతా నొప్పిగా ఉంది. రేపు రాఖీ పండుగకు ఉండనేమో.. నాన్నంటే నాకు ధైర్యం.. ఈ స్థితికి కారణమైన భర్త, అతని కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదల వద్దు.. అంటూ సూసైడ్ నోట్ లో రాసింది..

అంతేకాకుండా ఓ అమ్మాయి ముందు‌ నేను పనికిరాను అంటూ రాంబాబు హేళనగా ఆ అమ్మాయి ముందు చేసిన హేళన, జ్ఞాపకాలు మరిచి పోలేకపోతున్నా.. రోజు తాగి నన్ను హింసిస్తున్నాడు.. నా తలను మంచానికి వేసి‌ కొట్టి, వీపుపై పిడిగుద్దులు గుద్దాడు. మంచిగా వుండటమే నేను చేసిన తప్పా..! అమ్మా.. నన్ను నాన్నను ప్రతిసారీ తిడుతున్నాడు. నేను పేపర్ కరెక్షన్స్ చేస్తుంటే తీసుకొని ఎగరవేశాడు.. ఆ పేపర్స్ తీసుకెళ్ళి కాలేజీ వారికి ఇచ్చేయండి.. అరేయ్ తమ్ముడు జాగ్రత్త. ఈ సారి నేను నీకు రాఖీ కట్టలేనేమో.. అమ్మ, నాన్నను జాగ్రత్తగా చూసుకో.. తమ్ముడు.. అంటూ సూసైడ్ నోట్ రాసిన శ్రీ విద్యా బలవన్మరణానికి పాల్పడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *