A young woman gave birth at a tent exam center in Madhya Pradesh.

Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో టెన్త్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లి క్లాస్ రూమ్ లోనే డెలివరీ..!

ఎగ్జామ్ లోనే డెలివరి..!

  • మధ్యప్రదేశ్‌లోని పిథాంపూర్ పరీక్షా కేంద్రంలో దారుణం..
  • పరీక్ష రాసేందుకు పోయి.. ఎగ్జామ్ సెంటర్ లోనే మైనర్ బాలిక
  • టెన్త్ క్లాస్ లోనే తల్లైయిన యువతి…
  • తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు
  • మైనర్ బాలిక వాంగ్మూలంతో నిందితుడిపై కేసు నమోదు

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి బోర్డు పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని, పరీక్షా కేంద్రంలోని వాష్‌రూంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఏంటి నమ్మడం లేదా.. అవునండి నిజంగా పరీక్షకేంద్రంలోనే యువతి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఘటన పరీక్షా కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. ధార్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన పిథాంపూర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.

పరీక్ష రాయడానికి వెళ్లి.. పండంటి మగ బిడ్డకు జన్మ..!

ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టెన్త్ పరిక్సలు జరుగుతున్న విషయం తెలిసిందేగా. హా.. గా మధ్యప్రదేశ్‌ టెన్త్ బోర్డు ఎగ్జామ్స్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక మైనర్ విద్యార్థిని, పరీక్షా కేంద్రంలోని వాష్‌రూమ్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన రెండు రోజు క్రితం జరగ్గా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోర్ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన ఓ బాలిక, మంగళవారం ధార్ జిల్లా పిథాంపూర్‌లోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి గణితం పరీక్ష రాసేందుకు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికే సదరు విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. నొప్పి భరించలేక ఆమె ఇన్విజిలేటర్‌ను అడిగి వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఇక ఎంతసేపు అయినా విద్యార్థిని తిగిరి పరీక్షా హాలుకు రాకపోవడంతో అక్కడి సిబ్బందికి అనుమానం కలిగింది. సరిగ్గా అదే సమయంలో వాష్‌రూమ్ లోపలి నుండి పసికందు ఏడుపు వినిపించడంతో సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న మహిళా సిబ్బంది తలుపులు తెరిచి చూడగా, ఆ అమ్మాయి ప్రసవించి ఉండటం చూసి వారందరూ షాక్ అయ్యారు. ఇక వెంటనే పరీక్షా కేంద్రం యాజమాన్యం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించింది. తల్లీబిడ్డను హుటాహుటిన స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

9 నెలలు రహస్యంగా ఉంచిన ప్రెగ్నెన్సీని..

ఇక పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చిన విషయం పాఠశాల యాజమాన్యానికి కానీ, కనీసం తోటి విద్యార్థులకు కానీ తెలియకపోవడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు ఇండోర్ జిల్లాలోని బెత్మా ప్రాంతానికి చెందినది కావడంతో కేసును అక్కడి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ధార్ ఏఎస్పీ విజయ్ దబూర్ మీడియాకు వెల్లడించారు. విచారణలో భాగంగా గత రెండేళ్లుగా ఓ యువకుడితో పరిచయం ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిపై పోక్సో సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక బాలిక కుటుంబ సభ్యులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.


Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *