A To Z full story on Kurnool Kaveri bus accident..! What happened from 10 pm to 3 am..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మృత్యు బస్సు తిగుతోంది. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ బస్సు ఎక్కితే అనంత లోకాలకి వెళ్తారని. మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ట్రావెల్ బస్సే.. మృతు శకటం అయ్యింది. నేషనల్ హైవే 44 మృత్యు ద్వార మయ్యింది. మృత్యువు ఒడిలో చిక్కుకొని.. అగ్ని కిలలకు అహుతయ్యారు. ఆ యముడి యమ పాశం నుంచి ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. హైదరాబాద్ లోని ఎక్కి నిద్ర పోయిన ప్రయాణికులు, తెల్లారితే గమ్యం చేరుకుంటాం అని నిద్రపోయారు. గానీ వాళ్లకేం తెలుసు అదే వాళ్ల సాస్వత నిద్ర అని.. వాళ్లకేం తెలుసు ఇదే వాళ్ల లాస్ట్ జర్నీ అని.. జరగాల్సింది జరిగిపోయింది. క్షణాల్లో కాలి బుడిదయ్యాంది. ఒక్కడు చేసిన తప్పుకు.. 20 మందికి పైగా బలయ్యారు. ఈ పాపం ఎవరిది…? బైక్ నడిపిన శివశంకర్ దా..? బస్సు సెఫ్టి చూసుకోని కావేరి ట్రావెల్స్ యాజమాన్యాందా..? దీనికి బాధ్యులేవరు..?

ఇక విషయంలోకి వెళ్తే…

కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న హైదరాబాద్‌ నుంచి రాత్రి 10.30 గం.కు బయల్దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు బెంగళూరుకి బయల్దేరింది. కర్నూలు జిల్లా సమీపంలోకి రాగానే అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది అని మొదట వార్త ఛానెల్స్ లో ప్రచారం జరిగింది. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా మరో 21 మంది గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో 11 మంది ఆచూకీ లభించగా మరో 9 మంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాద సమయంలో.. 40 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నారులు ఉన్నారు. బస్సు ప్రమాదం నుంచి 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్పార్ట్ లోనే 19 మంది సజీవదహనం చేశారు. ఇక క్షతగాత్రులను కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రస్తుతం కర్నూలులోని ఆకాష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు బాధితులు స్వల్పగాయలతో తమ ఇళ్లకు చేరుకున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది..?

కర్నూల్ జాతీయ రహదారి 44 పై జరిగిన రోడ్డు ప్రమాదం పై కావేరి బస్సు డ్రవర్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ట్రావెల్ బస్సును ఏ బైక్ ఢీ కొట్టలేదని బస్సు రంనింగ్ లో ఉన్న సమయంలోనే.. రోడ్డుపై బైక్ పడిఉన్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం బస్సు రాక ముందే రోడ్డుపై బైక్ ప్రమాదం జరిగి ఉండవచ్చని కర్నూలు ఎస్పీ వెల్లడించారు. బైక్‌ ఢీకొన్న తర్వాత 300 మీటర్లు బైక్‌ను లాక్కెళ్లిన బస్సు. బైక్ ని లాక్కెళ్లడంతోనే మంటలు చెలరేగాయని డ్రైవర్ చెప్పాడు. ఇక మరింత పూర్తి సమాచారం కోసం బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు కర్నూలు ఎస్పీ. ఇక ఆ బైక్ వాహనదారుడిని శివ శంకర్ (20) గా గుర్తించారు. శివశంకర్‌ కర్నూలులోని ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక బైకర్ శివ కుటుంబ సభ్యలు పెళ్లిసంబంధాల్లో ఉన్నాటు సమాచారం. కానీ అర్ధరాత్రి శివశంకర్ బయటకు ఎందుకెళ్లాడో తెలియదని అని కుటుంబసభ్యులు వెల్లడించారు.

ఘటన స్థలంకు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు..

కర్నూల్ బస్సు ప్రమాదం తెలుసుకున్న తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఘటన స్థాలనికి చేరుకున్నారు. బస్సు ప్రమాదంపై గద్వాల జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్న మంత్రి జూపల్లి
సహాయ చర్యల వివరాలు, మృతులకు సంబందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బస్సు ప్రమాదంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసుల జాబీతా..!

ఇక ఈ బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలయిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఇక మరణించిన వారిలో.. ఆరుగురు తెలంగాణ, ఆరుగురు ఆంద్రప్రదేశ్ వాసులుకాగా గుర్తించినట్లు ఏపీ హోం శాఖ మంత్రి అనిత వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు తమిళనాడు, ఇద్దరు కర్ణాటక వాసులు, ఒకరు ఒడిశా, ఒకరు బిహార్‌ వాసి ఉన్నారు. స్పార్ట్ లోనే ఇద్దరు పిల్లలు సహా 19 మంది చనిపోయారు. ఇక బస్సులో 23 మంది పెద్దవాళ్లు ఉన్నారు. ఇక ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పిల్లలు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఇక దుర్మరణం పాలయిన వారిలో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. దీంతో ఏపీ హోంమంత్రి అనిత ఆదేశాలతో హైవే పక్కనే.. 16 ఫోరెన్సిక్‌ బృందాలు ఏర్పాటు చేశారు.
ఇక బాధితుల కుటుంబసభ్యులతో ఏపీ హోంమంత్రి అనిత మాట్లాడారు.

బస్సు ప్రయాణికుల జాబితా..

  • అశ్విన్‌రెడ్డి(36)
  • జి.ధాత్రి(27)
  • కీర్తి(30)
  • పంకజ్‌(28)
  • యువన్‌ శంకర్‌రాజు(22)
  • తరుణ్‌(27)
  • ఆకాశ్‌(31)
  • గిరిరావు(48)
  • బున సాయి(33),
  • గణేశ్‌(30),
  • జయంత్‌ పుష్వాహా(27)
  • పిల్వామిన్‌ బేబి(64),
  • కిశోర్‌ కుమార్(41)

రమేష్‌, అతని ముగ్గురు కుటుంబ సభ్యులు

  • రమేష్‌(30),
  • అనూష(22),
  • మహ్మద్‌ ఖైజర్‌(51),
  • దీపక్‌ కుమార్‌ (2)
  • అన్డోజ్‌ నవీన్‌కుమార్(26),
  • ప్రశాంత్‌(32)
  • ఎం.సత్యనారాయణ(28),
  • మేఘనాథ్‌(25)
  • వేణు గుండ(33),
  • చరిత్(21),
  • చందన మంగ(23)
  • సంధ్యారాణి మంగ(43),
  • గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)
  • సూర్య(24)
  • హారిక(30)
  • శ్రీహర్ష(24)
  • శివ(24),
  • శ్రీనివాసరెడ్డి(40)
  • సుబ్రహ్మణ్యం(26)
  • కె.అశోక్‌(27)
  • ఎం.జి.రామారెడ్డి(50)
  • ఉమాపతి(32)
  • అమృత్‌ కుమార్(18)
  • వేణుగోపాల్‌రెడ్డి(24)

జిల్లాల వారిగా మృతు పేర్ల జాబితా..

మృతురాలు సంధ్యారాణి..

కర్నూలు బస్సు ప్రమాదంలో మెదక్‌ జిల్లాకు చెందిన తల్లీకుమార్తె మృతి
ప్రమాదంలో మెదక్‌ జిల్లాకు చెందిన సంధ్యారాణి(43), చందన(23) మృతి
సంధ్యారాణి(43), చందన(23) స్వస్థలం మెదక్‌ జిల్లా శివ్వాయిపల్లి
బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న సంధ్యారాణి కుమార్తె చందన
తల్లి, కుమార్తె మృతితో మెదక్‌ జిల్లా శివ్వాయిపల్లిలో విషాదఛాయలు
కుమార్తెను బెంగళూరులో వదిలి.. మస్కట్‌ వెళ్లాలనుకున్న సంధ్యారాణి
భర్త ఆనంద్‌కుమార్‌తో కలిసి మస్కట్‌లో ఉంటున్న సంధ్యారాణి
వివాహం వేడుక కోసం ఇటీవల మెదక్ వచ్చిన సంధ్యారాణి దంపతులు
వారంక్రితం మస్కట్‌ వెళ్లిపోయిన సంధ్యారాణి భర్త ఆనంద్‌కుమార్
జ్వరం రావడంతో మస్కట్‌ వెళ్లకుండా ఆగిపోయిన సంధ్యారాణి

మృతురాలు అనూష..

బస్సు ప్రమాదంలో యాదాద్రి జిల్లా యువతి మృతి
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో యాదాద్రి జిల్లా యువతి మృతి
గుండాల మండలం వస్తకొండూరు చెందిన అనూష మృతి
బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న అనూష
దీపావళికి స్వగ్రామం వచ్చి రాత్రి బెంగళూరుకు బయలుదేరిన అనూష
రాత్రి ఖైరతాబాద్‌లో ట్రావెల్స్‌ బస్సు ఎక్కిన అనూష
అనూష మృతిచెందడంతో కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు

మృతురాలు ధాత్రి తల్లి వాణి

బాపట్ల జిల్లా వాసి గన్నమనేని ధాత్రి(27) మృతి
బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన ధాత్రి
హైదరాబాద్‌లోని మేనమామ ఇంటికొచ్చి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం
బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న గన్నమనేని ధాత్రి
పూసపాడులో నివాసం ఉంటున్న ధాత్రి తల్లి వాణి

ఇక ఏపీ నుంచి.. నెల్లూరు జిల్లా వాసులు నలుగురు మృతి
వింజమూరు మం. గోళ్లవారిపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ప్రమాదంలో గోళ్ల రమేష్ (32), అనూష(30), మనీష్ (12), మాన్విత (10) మృతి
15 ఏళ్లుగా బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో రమేష్ జాబ్ చేస్తున్నాడు. కంపెనీ ట్రిప్‌లో భాగంగా కుటుంబసభ్యులతో కలిసి

హైదరాబాద్‌ వెళ్లిన రమేష్
హైదరాబాద్‌ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఒకే కుటుంబం నుంచి నలుగురి మృతి చెంది.. గోళ్లవారిపల్లె గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి “మృత్యుంజయులు”

  • ఎం.సత్యనారాయణ(27), సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
  • జయసూర్య(24), మియాపూర్‌, హైదరాబాద్‌
  • నవీన్‌కుమార్(26), హయత్‌నగర్‌, హైదరాబాద్
  • సరస్వతీ హారిక(30), బెంగళూరు
  • నీలకుర్తి రమేశ్‌(36), భార్య శ్రీలక్ష్మి(నెల్లూరు)
  • నీలకుర్తి రమేశ్‌ కుమార్తె జస్విత, కుమారుడు అభిర
  • కాపర్‌ అశోక్‌ (27), శ్రీహర్ష(25), నెల్లూరు
  • కీర్తి(28), ఎస్‌ఆర్‌నగర్‌, హైదరాబాద్
  • వేణుగోపాల్‌రెడ్డి(24), ఎం.జి.రామారెడ్డి
  • సుబ్రహ్మణ్యం, అశ్విన్‌రెడ్డి, ఆకాష్‌, జయంత్‌ కుశ్వాల్‌
  • పంకజ్‌ ప్రజాపతి, గుణ సాయి, శివ, గ్లోరియా ఎల్సా సామ్‌

ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు రామిరెడ్డి, ఆకాష్‌ మాటలు..

రామిరెడ్డి మాటలు..

ప్రమాదం జరిగిన సమయంలో బయటపడ్డాను. అదే సమయంలో బస్సులో పెద్ద పేలుడు సంభవించింది. సరిగ్గా తెల్లవారుజామున 2.30 మధ్య ప్రమాదం జరిగింది. కానీ బస్సు ప్రమాద సమయంలో.. నన్ను బస్సు నుంచి ఎవరు లాగారో తెలియదు. ఇప్పటికి ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో అర్థం కాలేదు. ప్రమాదం సమయంలో బస్సులో ఏ డోర్లూ ఓపెన్‌లో లేవు. దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడు. ప్రత్యేక్ష సాక్షి బాధితుడు బస్సు ప్రయాణికుడు రామిరెడ్డి

ఆకాష్‌ మాటలు..

బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో.. హఠాత్తుగా లేచి చూస్తే పెద్దఎత్తున మంటలు వచ్చాయి. వెంటనే బస్సు అద్దం పగలగొట్టి బయటకు దూకాను. నాతో పాటు బస్సులో నుంచి మరో ఇద్దకు బయటకు దూకారు. దీపావళికి వచ్చి హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్నా. పెయింట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నా. ప్రయాణికుడు ఆకాష్‌.

గోళ్ల రమేష్‌ బంధువుల బైట్‌..

ప్రమాద స్థలికి వచ్చిన నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్‌ బంధువులు
గోళ్ల రమేష్‌ సహా నలుగురు కుటుంబసభ్యులు మృతి చెందినట్లు చెబుతున్న బంధువులు
గోళ్ల రమేష్‌(35), అనూష(30), మన్విత(10), మనీష్‌(12) మృతి చెందినట్లు బంధువుల వెల్లడి
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లి వాసులుగా గుర్తింపు

కావేరి బస్సులో కనిపించని భద్రతా ఏర్పాట్లు..

కావేరి బస్సులో స్పష్టమైన ఎవాక్యుయేషన్‌ ఇన్‌స్ట్రక్షన్లు ప్రదర్శించాలి. బస్సులో కనీసం రెండు DCP(4.5kg), ఒక CO₂ (2kg) ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉండాలి. రవాణా శాఖ పర్యవేక్షణలో ఫైర్ డ్రిల్లులు నిర్వహించాలి. ప్రయాణానికి ముందు ప్రయాణికులకు సేఫ్టీ వీడియోలు చూపాలి.

బయటపడ్డ కవేరి ట్రావెల్స్ బస్సు మోసాలు..!

భారత దేశంలో నిత్యం కోట్లల్లో ప్రయాణాలు సాగుతాయి. దీంతో కార్పొరెట్ సంస్థలన్ని కూడా ట్రావెల్స్ ని పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పెడితే పెట్టారు కానీ ప్రయాణికుల ప్రాణాలకు మాత్రం రక్షణ కరువైంది అనే చెప్పాలి. ఇక తాజగా జరిగిన ప్రమాదం సైతం ఇందుకు బెస్ట్ ఉదహార అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆల్‌ఇండియా పర్మిట్‌ పేరిట ప్రజల ప్రాణాలతో ప్రైవేట్‌ట్రావెల్స్‌ చెలగాటం ఆడుతున్నాయి. తాజా ఘటనతో.. భారీగా లొసుగులు బయటపడుతున్నాయి. తాజాగా ప్రమాదానికి గురైన వీ కావేరి ట్రావెల్స్‌ బస్సు డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్‌ అయింది. వీ కావేరి ట్రావెల్స్‌ డయ్యూ డామన్‌లో ఆల్‌ ఇండియా పర్మిట్‌ తీసుకుంది. ఈ కావేరి ట్రావెల్స్‌ సంస్థ ఒడిశా రాయగడలో అల్ట్రేషన్, ఫిట్‌నెస్ చేయించుకున్నారు. కావేరి ట్రావెల్స్‌ కేవలం 43 సీట్ల సీటింగ్‌ పర్మిషన్‌ తీసుకొని వాటిన స్లీపర్‌గా మార్చి బస్సులను నడిసిస్తుంది. కాగా దీనికి అల్ట్రేషన్‌లో సీటింగ్‌ పర్మిషన్‌ ని కూడా రాయగడ అధికారులు జారీ చేశారు. ఇక ఈ ప్రమాదానికి గురైన బస్సు 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్‌ చేసుకోని.. 2023లో ఎన్‌ఓసీతో డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్‌ మార్పు చేసుకుంది. రిజిస్ట్రేషన్‌ మార్చి స్లీపర్‌ కోచ్‌గా అక్రమానికి తెరలేపి అక్రమమంగా ట్రావెల్ చేస్తుంది.

మృతుల కుటుంబాలకు పరిహారం..

తెలంగాణ ప్రభుత్వం..

  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
  • బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
  • ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరులకు రూ.5 లక్షల పరిహారం
  • గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి పొన్నం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
  • ప్రమాదంలో చనిపోయిన ఆంధ్రప్రదేశ్ పౌరులకు రూ.5 లక్షల పరిహారం
  • గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి అనిత వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం..

  • మరణించిన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: ప్రధాని
  • కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
  • ప్రమాదంలో పలువురు మరణించడం బాధాకరం: ప్రధాని మోదీ
  • క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: ప్రధాని మోదీ
  • మరణించిన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: ప్రధాని
  • ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం: ప్రధాని మోదీ

బస్సు ఫిట్ నెస్ గా ఉందా..?

ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది అని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెల్లడించింది.
ప్రమాదానికి గురైన బస్సు DD 01 N 9490 తో రిజిస్టర్ అయింది. కావేరి ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న బస్సును డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు. 2030 ఏప్రిల్ 30వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. ప్రమాదానికి గురైన బస్సు 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది.

కావేరి బస్సుపై 16 ఛలాన్లు..

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తూ.. కర్నూలులో కాలి బూడిదైన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బుగ్గి బుడిదైంది. కాగా తాజాగా విచారణలో.. ఈ బస్సుపై దాదాపు 16 ఛలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి మొత్తం ఫైన్ విలువ రూ.23,120. అంటే ఏంటి.. ఒక అడ్డగోలు బస్సు.. ఇష్టం వచ్చినట్లు.. తెలుగు రాష్ట్రాల మధ్య యధేచ్చగా తిరిగేస్తోంది. ఛలాన్లు చెల్లించకపోతే, చర్యలు తీసుకోవాలి కదా. మరి RTO అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అనే ప్రశ్నలొస్తాయి. ఇక్కడ సమస్య ఏంటంటే.. ఆ బస్సు.. 2018లో డామన్‌ డయ్యూలో రిజిస్టర్ అయ్యింది. కాబట్టి.. ఒడిశా అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ.. ఎవ్వరూ పట్టించుకోలేదు.

తప్పెవరిది…? బాధ్యులెవరు..? శిక్ష ఎవరికి..?

మనం సామాన్యులం. ఎక్కడికైనా వెళ్లాలంటే.. బస్సు ఎక్కుతాం, టికెట్ తీసుకుంటాం. అంత వరకే మనకు తెలుస్తుంది. కానీ ఆ బస్సు ఎలాంటిది..? ఫిట్‌నెస్‌తో ఉందా..? మంచి బస్సేనా.? బ్రేకులు సరిగా పడతాయా..? ప్రమాదం జరిగితే.. ప్రాణాలతో తప్పించుకోవడానికి వీలవుతుందా..? ఇలాంటివేవీ మనకు తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది..? RTO అధికారులకు తెలుస్తుంది. అవును వీటి బాధ్యత RTO అధికారులది, ట్రావెల్స్, ఆ బస్సు యాజమాన్యులది. వీళ్లు కధా చూసుకోవాల్సింది. వీళ్లు కధా ప్రయాణికుల ప్రాణాలకు బాధ్యత వహించాల్సింది. వీళ్లు కదా.. వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సింది. మరి ఏం చేస్తుంది. కనీసం సెఫ్టి చూసుకోదా..? వేలకు వేలు టికెట్లు కొన్న సురక్షిత ప్రయాణాలు సాగుతాయా అంటే దానికి మాత్రం గ్యారెంటీ లేదు. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? ఎందుకున్నాయి..? రైలులో ప్రయాణిస్తే రైళ్లు మంటలు, విమానంలో ప్రయాణిస్తే అక్కడ ప్రాణాలకు భద్రత లేదు. ఇక బస్సులో ప్రయాణిస్తే.. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు. సరే ఇవ్వని కాదురా బాబు అంటూ మన సొంత కారులో పోతే.. దారిన పోయే దానయ్య వచ్చి గుద్దుతాడు. అక్కడ భద్రత లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు దూర ప్రయాణాలు చేయాలంటేనే వెణుల్లో వణుకు పుడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ బిక్కు బిక్కు అంటూ ఇంట్లోనే ఉంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *