ఇక విషయంలోకి వెళ్తే..
సాధారణంగా చేప అంటే నీటిలో మాత్రమే జీవిస్తుంది. కానీ, ప్రకృతి వైవిధ్యాల్లో భాగంగా కొన్ని జాతులు వింతగా మారుతాయి. వాటిలో ఒకటి మడ్ స్కిప్పర్స్. ఈ చేపలు నీటిలో మాత్రమే కాకుండా నేలపైనా చురుకుగా కదలగలవు. చెట్లను ఎక్కడం వీటి ప్రత్యేకత. అందుకే ఇవి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణ చేపలకు భిన్నంగా మడ్ స్కిప్పర్స్ కు బలమైన పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు కాళ్లలాగా పనిచేస్తాయి. బురద నేలపై నడవడానికి, గెంతులు వేయడానికి, మడ అడవుల వేళ్లను ఎక్కడానికి వీటివల్లే సాధ్యం అవుతుంది. ఇవి నీటిలోనూ, నేలపైనా శ్వాస తీసుకోగలవు.

ఇక విషయంలోకి వెళ్తే..
ప్రకృతి వైవిధ్యాల్లో మరో వింతగా నిలుస్తున్న ఈ చేపనే.. మడ్ స్కిప్పర్ అంటారు. ఎన్నో విశేషాలున్న ఈ చేప.. ఇప్పుడు పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది గోబియిడే కుటుంబానికి చెందిన చేపగా పరిశోధకులు గుర్తించారు. చేపలు సాధారణంగా గిల్ల్స్ ద్వారా మాత్రమే శ్వాసిస్తాయి. కానీ మడ్ స్కిప్పర్స్ చర్మం ద్వారా, నోరు, గొంతు లైనింగ్ ద్వారా కూడా ఆక్సిజన్ అందుకుంటాయి. ఈ ప్రక్రియను ‘కటేనియస్ రెస్పిరేషన్’ అంటారు. దీనివల్లే ఇది నీటి బయట కూడా చాలాసేపు బతకగలుగుతుంది. సాధారణ చేపలకు భిన్నంగా మడ్ స్కిప్పర్స్ కు బలమైన పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు కాళ్లలాగా పనిచేస్తాయి. నేలపై నడవడానికి, గాల్లో ఎగరడానికి, చెట్లను ఎక్కడానికి వీటివల్లే సాధ్యం అవుతుంది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది.

బురద నేల నుంచి చెట్ల వరకు..
సాధారణంగా బురద నేలలో ఇవి రెండు రోజుల పాటు జీవించగలవు. మడ్ స్కిప్పర్స్ కళ్లు చాలా పెద్దగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కళ్లు ఒకదానికొకటి వేరే వేరే దిశల్లో తిరగగలవు. తలపై ఉబ్బెత్తుగా ఉండే ఈ కళ్లతోనే ఇవి నీటి ఉపరితలంపై ఉండే.. చిన్న కీటకాలను, చిన్న చేపలు, రొయ్యలు, కీటకాల వంటి చిన్న జీవులను టక్కున ఎగిరి ఇట్టే పట్టేసుకుని తినేస్తాయి. అదే సమయంలో.. తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకు.. చుట్టూ ఓ కన్నేసి ఉంటూ.. వాటి బారినుంచి తమను తాము కాపాడుకుంటాయి. మగ చేపలు తమ ఆధిపత్యాన్ని చూపించడానికి పుష్-అప్‌లు చేస్తాయి. రెక్కలను ప్రదర్శించి శత్రువులను భయపెడతాయి. ఇవి బురదలో లోతైన బొరియలు తవ్వి గుడ్లు పెడతాయి. మగ చేపలు బొరియలను కాపాడుతూ గుడ్లను రక్షిస్తాయి. పర్యావరణానికి అనుగుణంగా మారిన ఈ ప్రత్యేక చేపలు సముద్ర తీర ప్రాంతాల్లో పరిశోధనకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
