A serious road accident in Rajasthan.. 20 people died

గత కొన్ని రోజులుగా దేశం వరసు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే జాతీయ రహదారీ 44 రోడ్డుపై కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో రెండు ఘోర ప్రమాదాలో చోటు చేసుకున్నాయి. ఇవాళ తాజాగా రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక రాజస్థాన్ లో అవ్వగా.. రెండోవది తెలంగాణలోని చేవెళ్లలో చోటు చేసుకుంది

ఇక వివరాల్లోకి వెళ్తే..

ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లో యాత్రికులతో వెళ్తున్న ఓ టెంపో.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఫలోదీ జిల్లాలో నిన్న రాత్రి వేగంగా వచ్చిన ఓ టెంపో ట్రావెలర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ కోలాయత్ ఆలయాన్ని దర్శించుకుని జోధ్‌పూర్‌లోని తమ స్వస్థలమైన ఫలోదీకి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్‌కు చెందిన వీరంతా.. బికనీర్‌లోని కొలాయత్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

భరత్ మాల ఎక్స్‌ప్రెస్‌వేపై టెంపో ట్రావెలర్ అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మరో ట్రక్కును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి, రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టెంపో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో పలువురు ప్రయాణికులు వాహనంలోనే చిక్కుకుపోయారు. టెంపో ట్రావెలర్ వేగానికి ముందు భాగం నుజ్జునుజ్జైంది. దీంతో ముందు కూర్చున్నవారిలో ఎక్కువ మంది చనిపోయినట్లు తెలిసింది. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని గమనించి.. టెంపోలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు సీట్లలో ఇరుక్కుపోవడంతో వాటిని బయటకు తీయడం చాలా కష్టంగా మారిందని ఫలోదీ పోలీస్ స్టేషన్ అధికారి అమనారామ్ తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి జోధ్‌పూర్‌కు తరలించారు.

ప్రమాదంపై రాజస్థాన్ సీఎం ఆరా..

ఇక ఘోర రోడ్డు ప్రమాదంపై.. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ స్పందించారు. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, ఇతర సీనియర్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి చికిత్స కోసం జోధ్‌పూర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. ఫలోడి రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాహనం పార్కింగ్ సరిగ్గా లేకపోవడం, నిలిపి ఉంచిన వాహనం సరిగ్గా కనిపించకపోవటం కూడా కారణాలుగా భావిస్తున్నారు.

ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి..

ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత హృదయ విదారక ఘటన అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం భజన్‌లాల్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *