Earthquake | రష్యాలో మరోసారి భారీ భూకంపం సంబవించింది. కామ్‌చట్కా తీరంలో ప్రకంపణలు వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్‌చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్‌లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది.
ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అయిన రష్యా ను వరుస భూకంపాలతో (Earthquake) కంటి మీదా కునుకు లేకుండా చేస్తున్నాయి. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్‌చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్‌లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఆ భూకంప తీవ్రతకు క్రాషెనిన్నికోవ్ లో ఉన్న 600 ఏళ్ల నాటి అగ్నిపర్వతం బద్దలు అయ్యింది. తాజాగా మరోసారి కామ్‌చట్కాలో భూకంపం వచ్చింది. కామ్‌చట్కా తీరంలో (Kamchatka Coast) మంగళవారం 6.0 తీవ్రతతో భూమి కంపించింది. ఈ తాజా భూ ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్‌స్కీ నగరానికి ఆగ్నేయంగా సుమారు 108 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 1:57 గంటలకు ఇది సంభవించినట్టు అక్కడి సీస్మిక్ మానిటరింగ్ సిస్టమ్స్ ధ్రువీకరించాయి.
ఇటీవలే వచ్చిన ఆ భారీ భూకంపం పసిఫిక్ మహాసముద్రం అంతటా సునామీ హెచ్చరికలకు కారణమైంది. తాజా భూకంపం సముద్రతీరంలో, మధ్యస్థ లోతులో సంభవించడం వల్ల ఉపరితలంపై దాని ప్రభావం తక్కువగా ఉందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ నిరంతరం కదులుతూ ఉండటం వల్ల కమ్చాట్కా ద్వీపకల్పం తరచుగా భూకంపాలకు గురవుతోంది. దీని కారణంగా, మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.