pre-wedding shoots : మురికి నీటిలో శవంలా తేలుతూ ప్రీ వెడ్డింగ్ షూట్.. షాక్ లో బంధువులు..!
pre-wedding shoots : ప్రస్తుతం మనం ఏ సీజన్ లో ఉన్నాం అంటే.. అందరు ఎండా కాలం అని అంటుంటారు. కానీ నిజానికి మనం ఉన్నది పెళ్లిళ్ల సీజన్. అవును మిరి విన్నది నిజమే.. ప్రస్తుతం వరుసగా పెళ్లిళ్లు నడుస్తున్నాయి. ప్రేమించుకోనో.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లో ఇలా చాలానే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇక వాళ్లంత సూత.. పెళ్లి కన్న ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ లో మునిగిపోయారు. ఇక అందులోనే ఇవాళ్టి మన చిత్రంత్రమైన వార్త. ఇంకా చెప్పాలంటే.. విచిత్రమైన వార్త.
ఇక విషయంలోకి వెళ్తే…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వింతైన ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పుడు మంచి మంచి ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత వివాహాలకు ముహూర్తాలు ఉండడంతో యువతీ యువకులు వివాహానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే పెళ్లి నిశ్చయమైన వాళ్లు తమ ప్రి – వెడ్డింగ్ షూట్లు చిత్ర విచిత్రంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ జంట తీసుకున్న ప్రీ వెడ్డింగ్ షూట్ తీవ్ర వివాదానికి దారి తీసింది. మురికి కుంటలో పడిపోయినట్టుగా ఆ జంటకు సంబంధించిన షూట్లు తీయడం వైరల్‌గా మారింది. సరిగ్గా వీళ్లు చేసిన ఈ వింత ప్రి వెడ్డింగ్ షూట్ కి ఈ సమేత సరిగ్గా సెట్ అవుతుంది. పిచ్చి తలకెక్కింది. రోకలి చుట్టండి అన్నారట.. వెనకటికి ఓ పెద్దమనిషి.. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత కొంతమంది వ్యవహార శైలి కూడా ఇలానే ఉంది. పిచ్చి పిచ్చి పనులు చేయడం.. వాటిని రీల్స్ లాగా మార్చడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వచ్చిన లైక్స్, కామెంట్లను చూసి శునకానందం పొందడం ప్రస్తుత సమాజంలో ఇదే జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకోని కొత్త జీవితం మొదలు పెట్టక ముందే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ లలో పిచ్చిపిచ్చి పనులు చేసి.. సోషల్ మీడియాలో పని గట్టుకోని మరి ప్రజల చేతుల్లో తిట్టుతింటున్నారు.
నయా ట్రెండ్…
ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో ఓ జంట నీటి కుంటలో విగత జీవుల్లాగా పడి ఉన్నట్టు వీడియో తీయించుకుంది. ఇంకా మీకు అర్ధం అయ్యేటట్లు అయితే మొదట్లో ఈ వీడియోని చూసిన చాలామంది ఆ జంట చనిపోయారని అనుకున్నారు. ఆ తర్వాత అదంతా షూట్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. “ఇది పెళ్లి షూటా.. లేక క్రైమ్ సీన్ ట్రైలరా?” అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తే.. మరికొందరు “ఇంతకీ పెళ్లి చేస్తున్నారా.. లేక సినిమా తీస్తున్నారా?” అని ప్రశ్నించారు. ఈ ధోరణిపై నెటిజన్లు స్థాయిలో మండిపడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో హ్యూమర్‌గా ఉందని కొందరు స్పందిస్తుంటే మరికొందరు మాత్రం ఇదేం పిచ్చి అంటున్నారు. విభిన్న తత్వాన్ని ప్రదర్శించే క్రమంలో ఇలాంటి వికృతాలకు పాల్పడడం దారుణమని నెటిజన్లు అంటున్నారు. “కొత్తగా ఉండాలంటే అందులో విభిన్నతత్వం ఉండాలి. ఆకట్టుకునే విధంగా ఉండాలి. అలాకాకుండా ఇలా చనిపోయినట్టు నటించడం ఏంటి.. నీటి కుంటలో పడి విగత జీవుల మాదిరిగా కనిపించడం ఏంటి.. ఇదంతా ఏం కల్చర్.. దీనిని ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారా.. ఇలా చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు.. దీనిని నూతనత్వం అంటారా.. స్టైల్ అంటే పదిమంది అనుసరించే విధంగా ఉండాలి.. అలాకాకుండా ముఖం మీద ఉమ్మి వేసే విధంగా ఉండకూడదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
బట్టలు లేకుండా.. ప్రీ వెడ్డింగ్ షూట్..

ఇక గతంలో కూడా ఆ కేరళ రాష్ట్రం ఆ మధ్య ఓ జంట తమ వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వహించింది. అందులో వారిద్దరూ కనిపించిన తీరు విమర్శల పాలైంది. ఒంటిమీద నూలు పోగు లేకుండా.. ఇద్దరూ ఒకే వస్త్రాన్ని ధరించారు. పైగా అది కూడా అత్యంత దారుణంగా ఉంది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం తాము ఇలా చేశామని ఆ జంట చెప్పింది. అయితే ఆ ఫోటోలు, వీడియోల ను చూసిన చాలామంది తీవ్రంగా విమర్శించారు. జంతువులు కూడా ఇలా ఉండమని వారిపై మండిపడ్డారు. ఇంతకీ వారి థీమ్ ఏమిటంటే నీటిలో చిక్కుపోయినట్టు.. తమ ప్రేమ బంధంలో కూడా నిండా మునిపోయినట్లు ఫొటోగ్రాఫర్లు సరికొత్త థీమ్‌ను రూపొందించారని నెటిజన్లు చెబుతున్నారు. భిన్నంగా.. వినూత్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్లు భావిస్తున్నారు. వాస్తవంగా ఆ వీడియో చూస్తే మాత్రం ఇద్దరు నీటిలో పడి చనిపోయినట్లు కనిపిస్తోంది. ఇలా దారుణంగా ఎలా తీస్తారని ప్రీ వెడ్డింగ్ షూట్ తీసే వారిపై ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిచ్చి పీక్స్‌కు చేరిందని మండిపడుతున్నారు. ఏమిటిది? ఎందుకు ఇలా తీయించుకోవడం? అని నిలదీస్తున్నారు. కాగా ఆ కొత్త జంట పెళ్లికి ముందే వైరల్‌గా మారారు. అయితే వారు ఎవరు? ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియదు. ఆ వీడియో చూస్తుంటే తమిళనాడులో జరిగినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరు చూసి.. మీ స్పందనను కామెంట్ రూపంలో తెలపండి.