A man wearing the Ayyappa Mala was caught drinking beer, Viral Video from Suryapet

అపచారం.. అపచారం…

అయ్యప్ప.. ఈ దేవుడి గురించి పని గట్టుకోని చెప్పక్కర్లేదు. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని దేవుడు. చిన్న పిల్లలకు ఆప్తుడు.. పెద్ద వాళ్లకు ఆపద్బాంధవుడు. అన్ని దేవుళ్ళలో అయ్యప్ప స్వామి చాలా పవర్ ఫుల్ అని చెబుతారు. ఎందుకంటే, ప్రతి ఏటా ఎంతో మంది భక్తులు 41 రోజుల పాటు మాలను ధరించి అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రస్తుతం, దీక్ష తీసుకున్న వ్యక్తి మద్యం సేవించిన వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఘటన హుజూర్నగర్ లో జరిగింది. అయ్యప్ప మాలలో ఉన్నపుడు మందు తాగుతూ, దీక్ష నియమాలను పాటించని వ్యక్తిపై విమర్శలు వస్తున్నాయి. దీక్షలో ఉన్నప్పుడు మద్యం సేవించరాదు. నియమాలకు కుడా విరుద్ధం.

ఇక విషయంలోకి వెళ్తే…

దేశ వ్యాప్తంగా ఎంత మంది అయ్యప్ప దీక్షలు చేపడుతుంటారు. ఇందులో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉంటారు. అయ్యప్ప దీక్ష అంటే కేవలం మాల ధరించడం మాత్రమే కాదు, అది ఒక కఠినమైన జీవన విధానం కూడా. కార్తీక మాసంలో ఈ అయ్యప్ప దీక్షలో ఉన్న 41 రోజుల పాటు బ్రహ్మచర్యం, సత్యం, ఆహార నియమాలు, మద్యం-మాంసాహారం నిషేధం వంటి కఠినమైన కట్టుబాట్లతో ఈ దీక్షను ఆచరిస్తారు. ఎవరైతే ఆ అయ్యప్ప మాల దరిస్తారో వాళ్లు అయ్యప్ప పట్ల.. మనసు, శరీరం, ఆలోచనలను చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచనలు కూడా చేయరాదు. కానీ కొందరు దుర్మార్గులు ఈ మాల వేసి కూడా.. చెండాలమైన, నీచమైన పనులు చేస్తున్నారు. తాజాగా అయ్యప్ప మాలలో ఉన్న ఓ వ్యక్తి మాల దారణలోనే మధ్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ వీడియో చూసిన అయ్యప్ప భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నువ్వేం మనిషివిరా స్వామి..!

ఇంకాస్తా వివరాల్లోకి వెళితే.. అయ్యప్ప మాల ధరించిన ఓ వ్యక్తి ఒక గదిలో కూర్చుని రహస్యంగా బీరు తాగుతున్నాడు. అదే సమయంలో గదిలోకి ప్రవేశించిన తోటి స్వాములు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని చూడగానే ఆ వ్యక్తి కంగారుపడి, తాను తాగుతున్న బీర్ బాటిల్ ను కుర్చీ కింద దాచి పెట్టె ప్రయత్నం చేశాడు. తన ముఖం దాచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు సైతం ప్రయత్నించాడు. ఇంతలో తోటి స్వాములు అతడిని అడ్డుకుని నిలదీశారు. “మనిషివా, పశువువా..? ఇదేం బుద్ధి తక్కువ పని..? మద్యానికి దూరంగా ఉండలేకపోతే మాల తీసేయాలి కానీ, ఇదేనా పద్ధతి..?” అంటూ అతగాడిని ప్రశ్నించారు. ఈ మొత్తం సంఘటనను వారు తమ ఫోన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో సదరు వ్యక్తిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇగ గతంలో కూడా ఓ దుర్మార్గుడు అయ్యప్ప దీక్షలో ఉండి దర్జాగా పాన్ బడ్డ వద్ద సిగరెట్ తాగుతున్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ సమయంలో తొలి వ్యక్తులు ఆ వ్యక్తి చేతి మాల తీపించి ఆ వ్యక్తికి దేశ శుద్ది చేశారు. ఇక తాజాగా వచ్చిన ఈ వీడియోలపై భిన్నమైన అభిప్రాయాలు అయితే వెల్లడవుతున్నాయి.

వీడియో పెట్టడం తప్పు..!

ఈ వీడియో వైరల్ కావడంపై కొందరు భక్తులు భిన్నంగా స్పందిస్తున్నారు. “ఆ వ్యక్తి తప్పు చేశాడు, నూటికి నూరు శాతం తప్పే! కానీ, అతని తప్పును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం సరికాదు. ముందు ఆ వీడియో డిలీట్ చేయండి!” అని కొందరు సూచిస్తున్నారు. “అయ్యప్ప స్వామి భక్తులు ఒకరి తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నించాలి, కానీ బహిరంగంగా అవమానించడం కాదు!” అని మరో భక్తుడు అభిప్రాయపడ్డాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “స్వామియే శరణం అయ్యప్ప!” అంటూ భక్తులు తమ భక్తిని, ఆగ్రహాన్ని, సలహాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. అయ్యప్ప దీక్ష అంటే కేవలం బాహ్య ఆచారాలు మాత్రమే కాదు, అది మనసు, ఆలోచనలు, ప్రవర్తనలో పవిత్రతను నిలబెట్టే ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఇలాంటి ఘటనలు భక్తులను కలవరపెట్టినప్పటికీ, అయ్యప్ప స్వామి పట్ల వారి భక్తి, నమ్మకం ఏ మాత్రం తగ్గలేదు. ఇక మరి కొందరు… “నిష్ఠగా ఉండలేనప్పుడు మాల ఎందుకు వేసుకోవడం..? మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు కదా..?” అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, “ఇలాంటి వారి వల్ల నిష్ఠగా దీక్ష చేసే స్వాములందరికీ అవమానం కలుగుతోంది” అని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన దీక్షకు ఇలాంటి వ్యక్తులు మచ్చ తెస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అయ్యప్ప దీక్షలే కాకుండా.. శివ దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్షల, అంజనేయ స్వామి దీక్షలు ఇలా చాలానే ఉన్నాయి. ఇక కొందరు నీచుల వల్ల.. ఇలాంటి పవిత్రమైన మాలలకు మచ్చ ఏర్పడుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *