మెక్సికో సిటీ : మెక్సికోలో (Mexico City) భారీ భూకంపం (earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ (Richter scale)పై 5.65 తీవ్రతతో నమోదయ్యింది. ఈ భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (German Research Center for Geosciences) తెలిపింది. ఒక్సాకా తీరానికి సమీపంలో ఈ భూకంపం సంభవించింది. భూకంపం పది కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావంతో మెక్సికోలో (Mexico) పలు భవనాలు కంపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి భయంతో పరుగులు తీశారు. భారీ భూకంపంతో ప్రజలు భయంతో వణికిపోయారు.
ప్రాణ, ఆస్తినష్టంపై…
అయితే ఈ భూకంపం కారణంగా ఎంత మేరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించిందన్న విషయం అధికారులు పూర్తి వివరాలను తెలియజేయలేదు. అయితే సహాయక చర్యలను మాత్రం ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2017లో మెక్సికోలో భూకంపం కారణంగా 355 మంది మృతి చెందారు.