A major earthquake has struck the island nation of Japan…

Earthquake : ఉత్తర జపాన్‌ తీరంలో సోమవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్‌ వాతావరణ సంస్థ పేర్కొంది. తీర ప్రాంతనగరమైన అమోరికి సమీపంలోని హక్కైడో తీరంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది.

ఇక విషయంలోకి వెళ్తే..

ఉత్తర జపాన్‌ తీరంలో సోమవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్‌ వాతావరణ సంస్థ పేర్కొంది. తీర ప్రాంతనగరమైన అమోరికి సమీపంలోని హక్కైడో తీరంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. సముద్ర ఉపరితలం నుంచి 50 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. దాంతో జపాన్‌ పసిఫిక్‌ తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈశాన్య తీరాన్ని 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొంది.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:45 గంటలకు ఈ భూకంపం సంభవించింది. హొకైడో తీరానికి సమీపంలో, భూమికి 32 మైళ్ల లోతున దీని కేంద్రం ఉన్నట్లు యూఎస్‌జీఎస్ (USGS) ప్రాథమికంగా వెల్లడించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. అణు విద్యుత్ కేంద్రాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. కాగా, గత నెల నవంబర్ 9న కూడా ఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసి, కొన్ని గంటల తర్వాత ఉపసంహరించుకున్నారు. అప్పుడు ఎలాంటి పెద్ద నష్టం జరగలేదు.

పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉండటంతో జపాన్‌లో తరచుగా భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ కఠినమైన భవన నిర్మాణ నిబంధనలను అమలు చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *