Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మథుర (Mathura) వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవే (Delhi-Agra Expressway)పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున పొగమంచు (dense fog) కారణంగా బస్సులు, కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగి.. వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగినట్లు అధికారులు తాజాగా తెలిపారు. సుమారు 80 మంది గాయపడినట్లు వెల్లడించారు.
ఇక విషయంలోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్లోని మథురాలో యమునా ఎక్స్ప్రెస్వే (ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్వే)పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఆగ్రా-నోయిడా లేన్లో 127 మైలురాయి వద్ద పొగమంచు కారణంగా మూడు కార్లతో పాటు ఏడు బస్సులు ఒకదాని వెనుక మరొకటి ఢీకొన్నాయి. స్పాట్లోనే మంటలు చెలరేగడంతో అన్ని వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అందులో ఒక రోడ్వేస్ బస్సు, మిగతా ఆరు స్లీపర్ బస్సులు ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు స్పాట్కు చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు మథురా (రూరల్) ఎస్పీ సురేష్చంద్ర రావత్ వెల్లడించారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయని, నాలుగు మృతదేహాలను వెలికితీశామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రమాదం..!
మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పది బస్సులు, పలు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బస్సులకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడటంతో ఏడు బస్సులు, కార్లు కాలిబూడిదయ్యాయి. మరికొందరు ప్రమాదాన్ని గమనించి వెంటనే అప్రమత్తమై వాహనాల నుంచి బయటకు దూకడంతో తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 11 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కాగా, గత రెండు రోజులుగా ఉత్తదారి రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దీంతో విజిబిలిటీ పడిపోయి. గత రెండు రోజుల్లో వరుసగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ప్రమాదంలో ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ… ‘‘ఒక ప్రమాదం జరిగింది. దాదాపు 3 నుంచి 4 బస్సులు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు నేను నిద్రపోతున్నాను. బస్సు పూర్తిగా ప్రయాణికులతో నిండి ఉంది. అన్ని సీట్లు నిండి ఉన్నాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగింది’’ అని తెలిపారు.
3 కార్లు.. 7 బస్సులు..
ఈ ప్రమాదంలో ముందుగా 3 కార్లు ఢీకొనగా.. అనంతరం వాటిని 7 బస్సులు వాటిని ఢీకొన్నాయి. ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి రోడ్‌వేస్ బస్సు కాగా.. మిగిలిన ఆరు స్లీపర్ బస్సులు.. ఈ ప్రమాదంలో చెలరేగిన మంటలను 11 ఫైర్ ఇంజిన్లు సహాయంతో అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే అన్ని బస్సులు మంటల్లో కాలిపోయాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని’ మధుర రూరల్ ఎస్పీ సురేష్ చంద్ర రావత్ వెల్లడించారు.