కళ్లు తెరిచిన శివయ్య..
తిరుపతిలోని గాంధీపురంలో మహా అద్భుతం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా అమరికలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు కూడా ఆలయానికి పోటెత్తారు.
ఇక విషయంలోకి వెళ్తే…
శ్రావణ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో పవిత్రమైన శ్రావణ మాసం నేపథ్యంలో శివ, వైష్ణవ ఆలయాలను రకరకాల పూలు, విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. తెల్లవారు జామున నుంచే ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రావణ మాసంను చాలా మంది పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో చాలా మంది మద్యం, మాంసాలకు దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శ్రావణ మాసం వేళ అద్భుతం చోటు చేసుకుంది.
కొండపై.. వింత ఘటన..
కలియుగ వైకుంఠ పూరి తిరుమలలో ఒక వైపు సాక్ష్యాత్తు ఆ ఏడు కొండల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసాడు. అంతే కాకుండా.. శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం శ్రావణం మాసం కావడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఎడు కొండలపై ఓ అద్భుతం చోటు చేసుకుంది. తిరుపతిలోని గాంధీపురంలో స్థానికంగా ఒక చిన్న శివాలం ఉంది. ఆ ఆలయంలో శివ లింగం కళ్లు తెరవడం ప్రస్తుతం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శివుడికి మూడో కన్ను ఉంటుందంటారు. అయితే.. ప్రస్తుతం గాంధీనగర్ లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో.. శివలింగం స్పష్టంగా కళ్లు తెర్చినట్లు కన్పిస్తుంది. ఇక ఈ వార్త ఆ చెవిన ఈ చెవిన పడటంతో ఎడుకొండలు పాకిపోయింది. దీంతో స్వామివారిని చూసేందుకు భక్తులు తండో తండాలుగా తరలి వస్తున్నారు. అంతే కాకుండా స్వామివారికి ప్రత్యేకంగా మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. మరో వైపు లింగం స్పష్టంగా కళ్లు తెర్చినట్లు కన్పిస్తుంటంతో అక్కడున్న భక్తులు భావోద్వేగానికి గురౌతున్నారు. శివయ్య.. స్వయంగా ఇక్కడకు వచ్చాడని, కళ్లు తెరిచి మరీ తమను చూస్తున్నాడని అక్కడి భక్తులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ ఘటనను వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఒక్కసారిగా వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు శ్రావణం మాసం వేళ, అది కూడా తిరుపతిలో ఇలాంటి ఘటన జరగటం అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.