బంగ్లాదేశ్ : భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో (Dhaka) ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర ప్రాంతంలోని ఓ పాఠశాల క్యాంపస్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) మిలిటరీ శిక్షణ విమానం (Military training aircraft) కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇక విషయంలోకి వెళ్తే..
Also Read : Tesla : భారత్ లో టెస్లా పరుగులు… ఎంత ధరనో తెలుసా..?
బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన F-7 (Bangladesh Air Forces F7 jet) శిక్షణ విమానం సోమవారం ఢాకా (Dhaka)లోని మైల్‌స్టోన్ స్కూల్, కళాశాల (Milestone School and College) భవనంపై కూలింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. విమానం కూలిన వెంటనే ప్రమాద స్థలం నుంచి మంటలు, నల్లటి పొగ ఎగసిపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పలువురు విద్యార్థులకు కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మైల్‌స్టోన్ కళాశాల (Milestone College) క్యాంటీన్ పైకప్పును విమానం ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు, స్థానిక మీడియా తెలిపింది.
Also Read : Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!
F-7 BGI విమానం గా గుర్తింపు..
ఇక ప్రమాదం జరిగిన సమయంలో క్యాంపస్ లో విద్యార్థులు ఉన్నారని.. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు (Assistive measures) చేపట్టి.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కూలిపోయిన F-7 BGI విమానం వైమానిక దళానికి చెందినదని బంగ్లాదేశ్ ఆర్మీ (Bangladesh Army) ప్రజా సంబంధాల కార్యాలయం ధృవీకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
బీజింగ్ ఉత్పత్తులపై అనుమానం..?
ఇక ఇదిలా ఉంటే.. F-7 జెట్ (F-7 Jet) ని చైనా (China) తయారు చేసింది. చైనా నిర్మిత F-7 కూలిపోవడం ఇది ఈ ఏడాదిలో రెండో ఘటన కావడం గమనార్హం. గత నెలలో మయన్మార్ (Myanmar) వైమానిక దళానికి (Air Force) చెందిన F-7 ఫైటర్ జెట్ సాగింగ్ ప్రాంతంలో కూలిపోయిన విషయం తెలిసిందే. నెల వ్యవధిలోనే రెండు చైనా నిర్మిత F-7 జెట్‌లు కూలిపోవడంతో బీజింగ్ ఉత్పత్తి చేసే రక్షణ పరికరాల నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Suresh