FILM: ఓటీటీలో నంబర్-1గా ట్రెండ్ అవుతున్న లవ్ ఓ లవ్.. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకు ఓటీటీలో భారీ సక్సెస్

ఈ వారం ఓటీటీల్లో 25కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అఖిల్ అక్కినేని సినిమా నుంచి పలు క్రేజీ రిలీజ్‌లు లైన్లో ఉన్నాయి. కానీ వాటన్నింటినీ పక్కకు నెట్టి… థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో నంబర్ వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏది? అందులో ఎవరు యాక్ట్‌ చేశారు? తెలుసుకుందామా!

ఇండస్ట్రీలో ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందబోతోంది. దాదాపు 25కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అఖిల్ అక్కినేని లెనిన్, సుకుమారి, హృదయం మురళి, వంద దేవుళ్లు వంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా ఈ వీకెండ్ ప్రేక్షకులను అలరించనున్నాయి. అయితే ఈ కొత్త రిలీజ్‌లకు ముందే ఓ సినిమా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది.

ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ నటించిన తొలి సినిమా లవ్ ఓ లవ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ మేనల్లుడు పవీస్ నారాయణన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సెల్వరాఘవన్, వనితా విజయ్‌కుమార్, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జులై 10న థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకున్నా… ఓటీటీలో మాత్రం ఊహించని స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది.

ఇక ఈ లవ్ ఓ లవ్ మూవీ గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ‘లవ్ ఓ లవ్’ ఇండియా వైడ్ టాప్-1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. రెండో స్థానంలో హాలీవుడ్ మూవీ ‘ది డెవిల్స్ మౌత్’ ఉండగా… మూడో స్థానంలో ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ కొనసాగుతోంది. అలాగే ‘నాగబంధం’, ‘మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’, ‘ఏక్ దిన్’, ‘అనోమీ’, ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్’, ‘ఘోస్ట్ ట్రైన్’, ‘స్పైడర్ మాన్: హోమ్‌కమింగ్’ సినిమాలు కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. అయితే ఈ భారీ సినిమాలన్నింటినీ వెనక్కి నెట్టి… ‘లవ్ ఓ లవ్’ నంబర్ వన్‌లో నిలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *