Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో దర్శనం క్యూలైన్లు మూసివేత..

తిరుమలలో భక్తుల రద్దీ ;
తిరుమలలో భక్తుల రద్దీ మరోవైపు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులతో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద నుంచి గరుడ కూడలి దాకా వాహనాలు క్యూ కట్టాయి. దీంతో ట్రాఫిక్ అధికారులు వాహనాలను దారి మళ్లించారు. రుయా ఆస్పత్రి జంక్షన్ వద్ద నుంచి ఇస్కాన్ టెంపుల్ మీదుగా బస్టాండుకు వాహనాలను దారి మళ్లించారు. అలాగే గరుడ కూడలి మీదుగా వెళ్లే వాహనాలను అన్నారావు జంక్షన్ నుంచి బస్టాండ్ వైపు దారి మళ్లించారు.
మరోవైపు వారాంతం కావటంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక శుక్రవారం రోజున 73,265 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 39,690 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ కానుకల ద్వారా టీటీడీకి 4.26 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. 4.09 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. 2.98 మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మరోవైపు 3,899 మంది భక్తులకు వైద్య సహాయం అందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకూ సమయం పట్టింది. అనూహ్యంగా పెరిగింది. వీకెండ్ కావటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనం కోసం బారులు తీరారు. దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీవారి భక్తులను క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. మరోవైపు సాధారణ రోజులలో ఉదయం పది గంటలకు టీటీడీ టైమ్ స్లాట్ సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తుంది. అయితే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శనివారం ఉదయం ఐదింటికే జారీ చేశారు.
మరోవైపు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులతో అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద నుంచి గరుడ కూడలి దాకా వాహనాలు క్యూ కట్టాయి. దీంతో ట్రాఫిక్ అధికారులు వాహనాలను దారి మళ్లించారు. రుయా ఆస్పత్రి జంక్షన్ వద్ద నుంచి ఇస్కాన్ టెంపుల్ మీదుగా బస్టాండుకు వాహనాలను దారి మళ్లించారు. అలాగే గరుడ కూడలి మీదుగా వెళ్లే వాహనాలను అన్నారావు జంక్షన్ నుంచి బస్టాండ్ వైపు దారి మళ్లించారు.
మరోవైపు వారాంతం కావటంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఇక శుక్రవారం రోజున 73,265 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 39,690 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ కానుకల ద్వారా టీటీడీకి 4.26 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. 4.09 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. 2.98 మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మరోవైపు 3,899 మంది భక్తులకు వైద్య సహాయం అందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకూ సమయం పట్టింది.
సెప్టెంబర్ నెలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
మరోవైపు అధిక మాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ సిద్ధమైంది. సెప్టెంబర్ ఎనిమిదో తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. 14వ తేదీ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 19వ తేదీ అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ జరగనుంది. సెప్టెంబర్ 23వ తేదీ చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి.
బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.