Vijay Thalapathy : విడాకుల కేసు తర్వాత ఓ పెళ్లికి జంటగా వచ్చిన TVK పార్టీ చీఫ్ విజయ్, హీరోయిన్ త్రిష.!
Vijay Thalapathy : దళపతి విజయ్ (Vijay Thalapathy) భార్య సంగీత (Sangeetha) విడాకుల (Divorce) కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విజయ్ డివోర్స్ వార్తల (Vijay Divorce News) వేళ ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని ఓ పెళ్లి రిసెప్షన్‌లో త్రిష – విజయ్ కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కలిసి ఒకే కారులో రావడం, సంప్రదాయ దుస్తుల్లో జంటగా వేదికపైకి వెళ్లడం వంటి దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల పిటిషన్‌లో సంగీత చేసిన ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరి పబ్లిక్ అప్పీరియన్స్ హాట్ టాపిక్ గా మారింది.
ఇక విషయంలోకి వెళ్తే…
కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (Tamil Vetri Kalagam), (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. తన భర్తకు మరో నటితో సన్నిహిత సంబంధం ఉందని ఆమె ఆరోపణలు చేయడం తమిళనాట సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న తరుణంలో, ఇప్పుడు హీరోయిన్ త్రిషతో కలిసి విజయ్ ఓ పెళ్లి వేడుకకు హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
విజయ్ అఫైర్…
TVK విజయ్.. ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని కీలక ఆరోపణలు చేసింది. తనకు న్యాయం జరగకపోతే ఆమె ఎవరో బయటపెడతానని సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణలు ఇటీవల హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే విజయ్- సంగీత విడాకుల వేళ ఇప్పుడు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్- త్రిష తాజాగా ఒకే కారులో ఓ వివాహ ఫంక్షన్ కు వెళ్లారు. చెన్నైలో కళాపతి ఎస్ సురేశ్ కొడుకు వివాహ రిసెప్షన్ కు విజయ్.. త్రిషతో కలిసి వెళ్లారు. ఇలా ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే విజయ్ విడాకుల వివాదాన్ని త్రిష కృష్ణన్ పేరుతో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. సంగీత తన డివోర్స్ పిటిషన్‌లో పేర్కొన్న నటి త్రిషనే అని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు సైతం విజయ్ – త్రిష బంధంపై ఆరోపణలు చేశారు. ఇలాంటి టైంలో త్రిషతో కలిసి విజయ్ ఒకే కారులో ప్రయాణించడం, రిసెప్షన్ కి అటెంట్ అవ్వడం తమిళ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కొత్త పెళ్లికి.. కొత్త జంట..
ఈ వేడుకకు విజయ్, త్రిష (Vijay, Trisha) ఒకే రకమైన వస్త్రాలు ధరించారు. విజయ్ సిల్క్ షర్ట్, ధోతీ ధరించారు. ఇక త్రిష కూడా అదే కలర్ మ్యాచింగ్ చీరలో కనిపించారు. ఈ వివాహ వేడుకలో విజయ్- త్రిష చాలా సంతోషంగా కనిపించారు. ఈ నేపథ్యంలో విజయ్ భార్య సంగీత పేర్కొన్న నటి త్రిషేనని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఇక త్రిష కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక విజయ్- త్రిష జోడీ సరైందిగా చెబుతుంటారు. వీరి కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి. ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే వీళ్లిద్దరూ ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం విజయ్, త్రిష విదేశాలకు విహారయాత్రకు వెళ్లారంటూ కొన్ని ఫోటోలు సంచలనం సృష్టించాయి. మరి తాజా పరిణామాల మధ్య ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి.
ఇక విజయ్ – త్రిష పలు చిత్రాల్లో కలిసి నటించి సూపర్ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఉందని, ఆ బంధంతోనే ఇప్పుడు ఈ వేడుకకు హాజరయ్యారని, దాంట్లో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని విజయ్ మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన తరుణంలో ఆయన ఇమేజ్‌ని దెబ్బ తీయాలని ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సహజమే అని అంటున్నారు.