Suspense over hero Vijay and Rashmika wedding ends.. Clarity on the wedding date..!

Vijay, Rashmika wedding : అవును మేం ఇద్దరం ఇష్టపడ్డాం.. పేళ్లి కూడా చేసుకోబోతున్నాం..! రష్మిక వీడియోలో..!

ఆ రోజే పెళ్లి..?

టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ల ప్రేమ, పెళ్లి వార్తలు సినీ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలలో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో, ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో, ఇటీవల వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందనే వార్తలు తీవ్ర సంచలనం సృష్టించాయి.

ఇక విషయంలోకి వెళ్తే..

తాజా సమాచారం ప్రకారం, 2025 అక్టోబర్‌లో విజయ్ దేవరకొండ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిందట. అంతేకాకుండా, 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్‌గా పెళ్లి జరగబోతోందని కూడా కొన్ని మీడియా వర్గాలు కోడై కూశాయి. గతంలో, రష్మిక తన పెంపుడు కుక్క ‘ఔరా’తో ఉన్న వీడియోలో ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరించి కనిపించడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది.విజయ్‌నే పెళ్లి చేసుకుంటా.. అంతకుముందు, ఒక క్యాంపస్ చర్చా కార్యక్రమంలో రష్మికను ప్రశ్నించగా, తను పనిచేసిన హీరోలలో ఎవరిని పెళ్లి చేసుకుంటారని అడిగితే… ఏ మాత్రం ఆలోచించకుండా ‘నేను విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పడం, అభిమానుల్లో సంతోషాన్ని, మీడియాలో చర్చను పెంచింది. అలాగే, తన భాగస్వామి కోసం ‘బుల్లెట్‌ను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా’ అని ఆమె చేసిన కామెంట్స్, వీరి బంధం ఎంత బలంగా ఉందో చెప్పకనే చెప్పాయి.

రష్మిక తాజా క్లారిటీ ఇదే!

అయితే, 2026 ఫిబ్రవరిలో వివాహం అనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో, రష్మిక మందన్నా తాజాగా ఆ వార్తలపై స్పందించారు. ఇటీవల ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తల గురించి అడగగా, రష్మిక నవ్వుతూ సమాధానం ఇచ్చారు. “నేను ఆ వార్తలను ధృవీకరించడానికి కానీ, ఖండించడానికి కానీ ఇష్టపడను. ఆ విషయం గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు, మేమే స్వయంగా ప్రకటిస్తాము” అని చాలా తెలివిగా చెప్పారు. రష్మిక తన వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యత ఇస్తానని, దాన్ని వృత్తిపరమైన జీవితం నుంచి పూర్తిగా వేరుగా ఉంచుతానని స్పష్టం చేశారు. “మేము నటులము, కానీ ఇంటికి వెళ్ళాక నేను పని గురించి చర్చించను. నా తల్లిదండ్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ వృత్తి గురించి ఎక్కువగా మాట్లాడను. నా వ్యక్తిగత జీవితాన్ని చాలా సీరియస్‌గా, ప్రైవేట్‌గా ఉంచుతాను” అని ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో, తన ప్రైవసీని గౌరవించాలని, ఊహాగానాలకు ముగింపు పలకాలని రష్మిక పరోక్షంగా కోరినట్లు అర్థమవుతోంది. మొత్తానికి, నేషనల్ క్రష్ ఇచ్చిన ఈ ‘నాన్-క్లారిటీ’ క్లారిటీతో, అభిమానుల ఎదురుచూపులు కొనసాగడం మాత్రం ఖాయం..!

Content Writer By : Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *