The first PSLVC62 rocket to launch this year.

ISRO PSLV C62 Launch : ఈ ఏడాది నింగిలోకి దూసుకెళ్లిన తొలి పీఎస్ఎల్వీ సీ62 రాకెట్‌..

ISRO PSLV C62 Launch : శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-62 రాకెట్​ను ఇస్రో ప్రయోగించింది. ఇక ఈ ప్రయోగం ఈ ఏడాది తొలి పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ను కావాడం విశేషం. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 1485 కేజీల ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఇస్రో.

ఇక విషయంలోకి వెళ్తే..

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్‌ ప్రయోగానికి 24 గంటల ముందు ఆదివారం ఉదయం 10.17కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యింది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) రూపొందించిన తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహమిది. పీఎస్‌ఎల్‌వీ సీ-62 రాకెట్‌ ద్వారా ఈఓఎస్‌-ఎన్‌1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకం. 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమిది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది. ఈ మిషన్‌ ద్వారా 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నాం. ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగంలో ప్రధాన పేలోడ్ EOS-N1, దీనికి ‘అన్వేష’ అని పేరు పెట్టారు. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. ఇది అత్యాధునిక ‘హైపర్స్పెక్ట్రల్ ఇమేజింగ్’ సాంకేతికత కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను కనిపెట్టడం, దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు విపత్తు నిర్వహణలో ఇది కీలక సమాచారాన్ని అందిస్తుంది.

ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్, శాస్త్రవేత్తలు శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి ముక్కంటి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాల్లోనూ పూజలు చేశారు. రాకెట్, ఉపగ్రహ నమూనాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు.