
ఆస్ట్రేలియా (australia) సిడ్నీ(Sidney) లో ఆదివారం సాయంత్రం భారీగా కాల్పులు జరగడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతుండగా ఇద్దరు గన్మెన్లు బీజ్లోకి దూసుకొచ్చి ఫైరింగ్ చేశారు. దాదాపు 50 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. దీంతో అక్కడుకున్న పర్యాటుకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులతో ఇద్దరు వ్యక్తులు పాదచారుల వంతెనపైకి వచ్చి కాల్పులు జరిపినట్లు వీడియోస్ లో రికార్డ్ అయ్యింది. ఓ కార్యక్రమాన్ని టార్గెట్గా చేసుకుని ఈ దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Revanth Reddy : అట్టహాసంగా ప్రారంభమైన “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”… ప్రముఖులు ‘రోబో’ స్వాగతం..
Also Read : Plastic Footpath : హైదరాబాద్ లో జపాన్ టెక్నాలజీ..! ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్ పాత్ లు…
ఇక విషయంలోకి వెళ్తే..
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో ఉగ్రదాడి కలకలం రేపుతోంది. ప్రముఖ పర్యటక బాండీ బీచ్లో ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం యూదుల ‘హనుక్కా’ పండుగ వేడుకలు జరుగుతున్న ప్రదేశంలో ఈ దాడి జరిగింది. దీనిని ఉగ్రవాద చర్యగా అధికారులు ప్రకటించారు. ఈ దాడిని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్రంగా ఖండించారు. “యూదుల పండుగ రోజున వారిని లక్ష్యంగా చేసుకుని చేసిన క్రూరమైన దాడి ఇది. ఈ దాడిలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారిలో ఒకరిని కాల్చి చంపగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడో వ్యక్తి ప్రమేయంపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు.