రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని మోదీ పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుని పుతిన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయంలో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ, పుతిన్‌లు ఒకే వాహనంలో అక్కడి నుంచి బయలుదేరారు. ఇక, ఎయిర్‌పోర్టులో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు నృత్యాలతో పుతిన్‌కు సంప్రదాయ స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం రాత్రి ప్రధానమంత్రి విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలకనున్నారు. అలాగే, 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్‌తో సహా పలు రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి.


