Big twist in Bihar politics.. Union Minister Chirag Paswan as CM?

బీహార్‌లో NDA కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీజేపీ, జేడీయూతో పాటు కూటమిలో మరో పార్టీ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJP(RV)), ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్జేపీ (ఆర్‌వి) పార్టీకి బీహార్‌ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. బీహార్‌లో ఎన్డీఏ గెలిస్తే, ఉప ముఖ్యమంత్రి పదవి చేపడతారా? అని ఈ వారం ప్రారంభంలో విలేకర్లు చిరాగ్‌ను అడిగారు. దానికి ఆ యన రెస్పాండ్ అవుతూ, కూటమి మెజారిటీ సాధిస్తే తమ పార్టీకి ఆ పదవి వస్తుందని చెప్పారు. ఇక ఇప్పుడు అనుకున్నట్లుగానే సీట్లు సైతం వచ్చాయి. అయితే ఈ సారి నితీశధ్ సీఎం అవుతారా లేదా చిరాగ్ పాశ్వాన్ అవుతారా అని సందిగ్ధంగా మారింది.

ఇక విషయంలోకి వెళ్తే..

బీహార్… యావత్ దేశం మొత్తం అచర్యపోయేలా చేసిన ఎన్నికలు. ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమి నేతలు కూడా ఊహించని విధంగా బిహార్ ఫలితాలు వచ్చాయి. కూటమిలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ పార్టీలు బీహార్ లో విజయ దుందుభి మోగిస్తున్నాయి. బీజేపీ, జేడీయూ పార్టీలకు ధీటుగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కూడా ఎన్నికల ఫలితాల్లో అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 90 శాతం స్ట్రైక్ రేటుతో దూసుకెళ్తుంటే.. యువ పార్టీ ఎల్జేపీ సైతం చిరాగ్ పాసవాన్ సారధ్యంలో 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో విక్టరీ కొట్టింది. ఈ అఖండ విజయంలో ఆ పార్టీ అధినేత చిరాగ్ పాసవాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. గత ఎన్నికల్లో ఒక్కటంటే.. ఒక్క స్థానానికే పరిమితమైన ఎల్జేపీ పార్టీ.. ఈ ఎన్నికల్లో 75 శాతానికి పైగా స్ట్రైక్ రేటుతో విజయం సాధించడంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో కూడా జేడీయూ ఎక్కువ స్థానాలు దక్కించుకుంది. దీంతో మళ్ళీ నితీశ్ కుమారే (nithish-kumar) సీఎం అనిఫిక్స్ అయ్యారు. 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. బీహార్ లో నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

సీఎం పదవికి నితీశ్ దూరం..?

నితీశ్ కుమార్.. బీహార్ లో తిరుగులేని శక్తిగా భారత రాజకీయాల్లో సరి కొత్త చరిత్రను తీరగాశారు.
బీహార్ ప్రాంతీయ పార్టీ జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవి వీళ్లద్దరు వేరు కాదు.. దాదాపు 20 సంవత్సరాలుగా బీహార్‌ను నడిపించిన వ్యక్తి.. ఇప్పుడు మరో సారి శాసనసభ ఎన్నికల్లో చక్రం తిప్పారు. కానీ ఈ సారి సీఎం కూల్చి ఆయననుంచి చేయి జారిపోతుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ సారి కూడా ఆయనే సీఎం చేయడానికబీజేపీ సిద్ధంగా లేదు. బిహార్‌ లో ఎడ్డీయేని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పని చేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి తోడు నితీశ్ కుమార్ వయసు రిత్యా, బాధ్యతల ఒత్తిడి దృష్యా ఆయన ఈసారి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని మోదీ లాంటి వారు కూడా నితీశ్ కాకుండా బీజేపీ అభ్యర్ధికి పట్టం కట్టాలని అనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే మొదటి నుంచీ ఎన్డీయే కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేదు.

అప్పుడు అవమానం.. ఇప్పుడు ప్రశంసలు..

2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్తు ఒక రకంగా అంధకారంగా కనిపించింది. అదే ఏడాదిలో చిరాగ్ ఎన్‌డీఏ, ఇతర కూటములతో పొత్తు పెట్టుకోలేదు, సొంతంగానే పోటీ చేశారు. అయితే 130 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా, కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నారు. ఈసారి ఆయన పార్టీకి ఎన్‌డీఏ నుంచి 29 సీట్లు దక్కగా, ఇతర మిత్రపక్షాలు అంతగా అంగీకరించలేదు. కానీ ఆ పార్టీ ఇప్పుడు గ్రాండ్ విక్టరీతో మంచి స్ట్రైక్‌రేట్‌తో విజయాలు సాధించడం విశేషం. 43 ఏళ్ల చిరాగ్ ముందు నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీపై అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్‌డీఏలో ఉన్నా లేకున్నా సైద్ధాంతికంగా మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. 2020 ఎన్నికల్లో తన సమస్య అంతా నితీష్ కుమార్‌తోనే అని బల్ల గుద్ది చెప్పారు. అప్పుడు సొంతంగా పోటీ చేసి, జేడీయూ అభ్యర్థులపైనే తమ పార్టీ నేతల్ని బరిలోకి దింపారు. అలా జేడీయూ ఓట్లు చీల్చి నితీష్‌ను దెబ్బకొట్టారు. ఆ తర్వాత 2021లో LJP చీలిపోయింది. చిరాగ్ చిన్నాన్న, ఎల్జేపీ వ్యవస్థాపకుడైన దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడైన పశుపతి నాథ్ పరాస్.. మోదీ శిబిరంలోకి వెళ్లారు. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి. చిరాగ్ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలోకి వచ్చి, లోక్‌సభ ఎంపీగా గెలిచారు. మోదీ 3.0 కేబినెట్‌లో కేంద్ర మంత్రి అయ్యారు. ఒకప్పుడు తన తండ్రి సహచరుడైన 74 ఏళ్ల నితీష్‌తో ఉన్న విభేదాన్ని ఆయన ప్రస్తుతం ప్రస్తావించట్లేదు. ఏదో ఒక సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారా అని ఆయన్ను అడిగితే.. 2030 నాటికి అది జరుగుతుందని చెప్పారు. చిరాగ్ తండ్రి రామ్ విలాస్ కూడా ఎక్కువగా జాతీయ రాజకీయాల్లోనే కొనసాగారు.

బీహార్ లో చిరాగ్ పాస్వాన్ రికార్డు..

ఇక బీహార్ ఎన్నిక (Bihar Election 2025) ల్లో ఈసారి చిరాగ్‌ పాస్వాన్ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ(రామ్‌ విలాస్) అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎన్నికల్లో ఎల్‌జేపీ 29 స్థానాల్లో పోటీ చేయగా 23 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రికెట్‌లో రవీంద్ర జడేజా చివరి ఓవర్లలో మ్యాచ్‌ను గెలిపించినట్లే.. చిరాగ్‌ పాస్వాన్‌ కూడా ఎన్డీయే తరఫున ఇలాంటి పాత్రే పోషించినట్లు ఆయనపై ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఈ సారి బీహార్ లో యువ కెరటంకే సీఎం పగ్గాలు అందబోతున్నాయి అని బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిగ్ గా మారింది.

బీహార్ లో మహారాష్ట్ర ఫార్ములా కొత్త సీఎం ఆయనే..?

మరోవైపు బీహార్ లో కూడా మహారాష్ట్రఫార్ములానుప్రయోగిస్తారనే టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ముందుగా ముఖ్యమంత్రిని ప్రకటించలేదు. మెజార్టీ సీట్లు వచ్చాక పొత్తులొ భాగమైన శివసేనా అభ్యర్థి షిండేని కాకుండా బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బీహార్ లో కూడా దీనినే అమలు చేస్తారని అంటున్నారు. బీజేపీ అభ్యర్థి చిరాగ్ పాశ్వాన్ ను సీఎం చేస్తారని అంటున్నారు. అలాగే తెరపైకి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు కూడా వచ్చింది. ఈ సారి ఎలా అయినా బీహార్ లో బీజేపీ తన ఆధిక్యాన్ననిలబెట్టుకోవాలని అనుకుంటోంది. అందుకే వీరిద్దరిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తుందని వార్థులు వినిపిస్తుననాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *