జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఘోర ఓటమి తప్పడం లేదు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటగా షేక్ పేట్ డివిజన్ లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఇక ముందుగా షేక్ పేట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు కూడా పోటా పోటిగా ఓట్లు పోల్ అయ్యాయి. కానీ బీజేపీకి మాత్రం నత్త నడకలా ఓట్లు పోల్ అయ్యాయి.
దీంతో రెండు రౌండ్ల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుంది. ముందుగా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినా.. తర్వాత వెనుకంజులో పడింది. దీంతో షేక్‌పేట్ డివిజన్ ఫలితాల్లో బీజేపీ కనుమరుగైంది. రెండు రౌండ్లు కలిపి లంకల దీపక్ రెడ్డికి 307 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రమంతులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు లెక్కచేయలేదు. రెండు రౌండ్ల కలిపి కాంగ్రెస్ 1144 ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు.
ఇక ఇప్పుడు.. మూడు పార్టీల అభ్యర్ధుల కలిపి మొత్తం ఓట్లు గానీ..
కాంగ్రెస్ : 50806
బీఆర్ఎస్ : 37990
బీజేపీ : 8569